Advertisementt

విజయసాయిరెడ్డి సాక్షిస్కెచ్‌ సూపరో సూపర్!

Mon 13th Jun 2016 10:48 PM
vijaya sai reddy,sakshi channel,ysrcp,chandrababu,kcr,ys jagan  విజయసాయిరెడ్డి సాక్షిస్కెచ్‌ సూపరో సూపర్!
విజయసాయిరెడ్డి సాక్షిస్కెచ్‌ సూపరో సూపర్!
Advertisement
Ads by CJ

తెలంగాణలో టివి9, ఎబిఎన్‌ ఆంద్రజ్యోతి చానెల్స్‌ను దారికి తెచ్చుకోవడంలో సీఎం కేసీఆర్‌ సఫలీకృతుడు అయ్యాడు. ఏపీలో కూడా ఎన్టీవీ ప్రసారాలను ఆపివేసి ఆ చానెల్‌ను దారిలోకి తెచ్చుకోవడంలో బాబు కూడా విజయం సాధించాడు. కానీ సాక్షి చానెల్‌ విషయంలో మాత్రం బాబు పథకం సత్పలితాలను ఇవ్వడంలో విఫలం అవుతుందనే అనిపిస్తోంది. దీనికి విజయసాయిరెడ్డి సిద్దం చేసిన స్కెచ్‌ అద్బుతంగా ఉండటమే కారణంగా తెలుస్తోంది. ఇప్పుడే కాదు.. భవిష్యత్తులో కూడా ఇలాంటి పరిణామాలే ఎదురైతే దానికి తగ్గ స్కెచ్‌ను విజయసాయిరెడ్డి సిద్దం చేశాడు. అందుతున్న సమాచారం ప్రకారం సాక్షి చానెల్‌ ప్రసారాలను నిలిపివేసినందుకు జగన్‌ తన కార్యకర్తలకు, సానుభూతిపరులకు కొన్ని ఆదేశాలను జారీ చేయున్నాడట. దాని ప్రకారం ఆయనంటే, ఆయన చానెల్‌ అంటే, అయన పార్టీ అంటే సానుభూతి ఉన్న కేబుల్‌ వినియోగదారులు తమ సెట్‌అప్‌ బాక్స్‌లను కేబుల్‌ ఆపరేటర్లకు వెనక్కి తిరిగి ఇవ్వనున్నారు. ఇలా మండలానికి కనీసం ఐదు వేల మంది ముందుకు వస్తారని సాయిరెడ్డి అంచనా. అలా జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 25లక్షల కనెక్షన్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఎమ్మెస్వోలు కోల్పోతారు. నెలకు 150రూపాయలు వేసుకున్నా అది 37కోట్ల 50లక్షల రూపాయల ఆదాయాన్ని ఆపరేటర్లు కోల్పోయే అవకాశం ఉంది. మరోపక్క ఈ 25లక్షల కనెక్షన్లను డిష్‌ నెట్‌వర్క్‌ యాజమాన్యాలతో డీల్‌ మాట్లాడి డీల్‌ సెట్‌ చేసేందుకు ప్రయత్నాలు ఆరంభమయ్యాయి. ఒకేసారి 25లక్షల కనెక్షన్లు వస్తాయంటే ఏ డిష్‌ టీవీ అయినా ఎగిరిగంతేయడం ఖాయం అంటున్నారు. ఈ విధంగా సాక్షి టీవీ చంద్రబాబు ఎత్తుకు టిట్‌ ఫర్‌ టాట్‌ చెప్పనుందని సమాచారం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ