Advertisementt

డొనేట్ చేస్తేనైనా దక్కుతుందేమో చూద్దాం!

Tue 14th Jun 2016 08:22 PM
vicky donor,sumanth,mallik ram,vicky donor remake  డొనేట్ చేస్తేనైనా దక్కుతుందేమో చూద్దాం!
డొనేట్ చేస్తేనైనా దక్కుతుందేమో చూద్దాం!
Advertisement
Ads by CJ

అక్కినేని కాంపౌండ్‌ నుండి వచ్చిన హీరోలలో సుమంత్‌ ఒకడు. హీరోకి కావాల్సిన లక్షణాలన్నీ ఆయనలో పుష్కళంగా ఉన్నప్పటికీ ఈ హీరో పెద్దగా రాణించలేకపోతున్నాడు. 'ప్రేమకథ, మహానంది, గోదావరి, సత్యం, గౌరి' వంటి చిత్రాలలో నటించి తనను తాను ప్రూవ్‌ చేసుకున్నప్పటికీ ఈ హీరోకు నాగచైతన్య, అఖిల్‌ల స్దాయిలో అక్కినేని అభిమానుల నుండి కానీ నాగార్జున నుండి కానీ పెద్దగా ప్రోత్సాహం రాలేదు. చంద్రసిద్దార్ద్‌ దర్శకత్వంలో వచ్చిన 'ఏమో గుర్రం ఎగరావచ్చు' చిత్రం తర్వాత చాలా గ్యాప్‌ తీసుకున్నాడు హీరో సుమంత్‌. ప్రస్తుతం ఆయన బాలీవుడ్‌ మూవీ 'విక్కీడోనర్‌' రీమేక్‌లో నటిస్తున్నాడు. నూతన దర్శకుడు మల్లిక్‌రామ్‌ డైరెక్ట్‌ చేస్తున్న ఈ రొమాంటిక్‌ డ్రామా ప్రస్తుతం డబ్బింగ్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా హీరో సుమంత్‌ తాను డబ్బింగ్‌ చెబుతున్న ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకున్నాడు. ఈ చిత్రానికి ఇంకా పేరు పెట్టలేదు. స్వయంగా ఈ చిత్రాన్ని సుమంత్‌ నిర్మిస్తుండటం విశేషం. పల్లవి సుభాష్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్దమవుతోంది. మరి తన సెకండ్‌ ఇన్నింగ్స్‌లో అయినా సుమంత్‌ హిట్‌ను కొడతాడేమో వేచిచూడాల్సివుంది...!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ