ప్రతిపక్షనేత జగన్‌తో పాటు చిరంజీవి, బొత్స సత్యనారాయణ వంటి నాయకులు తుని ఘటనపై సిబిసీఐడి విచారణ కాదు... దమ్ముంటే సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. దానికి అనూహ్యంగా చంద్రబాబు ఓకే అన్నాడు. రాజధాని భూములతో పాటు పట్టిసీమ వంటి పలు అంశాలపై జగన్ సిబిఐ విచారణను కోరితే బాబు తిరస్కరించాడు. దాంతో ఈ విషయంలో కూడా సిబిఐ విచారణకు బాబు అంగీకరించడని వారు పొరపాటు పడ్డారు. కానీ దానికి బాబు ఓకే చెప్పడంతో జగన్‌తో పాటు మిగిలిన నాయకులకు నోట మాటరాలేదు. అయితే చంద్రబాబు తెలివిగా ముద్రగడ కోరుకుంటే సిబిఐ విచారణకు సిద్దం అని ప్రకటించి తన వ్యూహాన్ని పాటించాడు. ఒకవేళ ముద్రగడ సిబిఐ విచారణకు అంగీకరిస్తే ఆయన దీక్ష విరమించాల్సి వస్తుంది. ఆగష్టులో మంజునాథ్ కమిషన్ రిపోర్ట్ వచ్చేదాకా ముద్రగడ దీక్ష చేయలేడు. ఆలోపు ఉద్యమం చల్లారిపోతుంది. దాంతోనే ముద్రగడ్డ సిబిఐ విచారణకు నో చెబుతున్నాడు. కొందరు కాపునాయకులు తుని ఘటన వెనుక టిడిపి కార్యకర్తల ప్రమేయం ఉందని వాదిస్తున్నారు. అదే నిజమైతే.. అది ఉద్దేశ్యపూర్వకంగా చంద్రబాబు చేసిన పనే అయితే ఆయన సిబిఐ విచారణకు ఎందుకు అంగీకరిస్తాడు? అనే ప్రశ్న కూడా సామాన్య ప్రజానీకంలో వస్తుంది. మరోవైపు సి.రామచంద్రయ్య అయితే మరో అడుగు ముందుకేసి ఈ ఘటనకు పాల్పడింది పోలీసులే అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నాడు. మొత్తానికి సిబిఐ విచారణ విషయంలో చంద్రబాబు వ్యూహం ముందు కాపు నాయకులు మొహం తేలేశారు. ఇప్పుడు ఒక్కరు కూడా సిబిఐ విచారణకు డిమాండ్ చేయడం లేదంటే బాబు పాచిక ఎలా పారిందో అర్ధం అవుతూనే ఉంది.