Advertisementt

ఈసారి వర్మ 'ఐలవ్‌ యు' చెప్పాడు!

Wed 15th Jun 2016 02:54 PM
ram gopal varma,i love you,realdonaldtrump  ఈసారి వర్మ 'ఐలవ్‌ యు' చెప్పాడు!
ఈసారి వర్మ 'ఐలవ్‌ యు' చెప్పాడు!
Advertisement
Ads by CJ

మొన్నటికి మొన్న 'ఉడ్తాపంబాజ్‌' గొడవకి స్పందిస్తూ... అనురాగ్‌కశ్యప్‌ని ఉద్దేశించి మనద్దిరం 'గే'లు కాకపోయినా సెన్సార్‌బోర్ద్‌పై మీరు చేసిన పోరాటానికి మీ నోట్లో నోరుపెట్టి ముద్దుపెట్టాలని ఉందని వర్మ కామెంట్‌ చేసి సంచలనం సృష్టించాడు. తాజాగా ఆయన మనసు అమెరికన్‌ అధ్యక్ష పదవి రేసులో ఉన్న రోనాల్డ్‌ ట్రంప్‌ మీద పడింది. ఆయన రోనాల్డ్‌ ట్రంప్‌కు 'ఐ లవ్‌యూ' చెప్పాడు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ తరపున పోటీ చేస్తున్న రోనాల్డ్‌ ట్రంప్‌ అంటే వర్మకు ఉన్న ప్రత్యేక అభిమానం అందరికీ తెలిసిందే. తనకు వీలు చిక్కినప్పుడల్లా ట్రంప్‌ మీద తన ప్రేమాభిమానాలను ప్రదర్శిస్తూనే ఉన్నాడు వర్మ. తాజాగా ఓర్లాండ్‌లోని గే నైట్‌ క్లబ్‌లో ఇస్లామిక్‌ తీవ్రవాదిగా భావిస్తున్న ఒమర్‌మతీన్‌ కాల్పులు జరిపి 50మందిని హతమార్చిన నేపథ్యంలో వర్మ చూపు మరోసారి ట్రంప్‌పై పడింది. అమెరికన్లకు రెండే రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి వారు రోనాల్డ్‌ ట్రంప్‌ను ఆశీర్వదించాలి. లేదా 'అల్లా' వాళ్లను ఆశీర్వదించాలి.. అని ట్వీట్‌ చేసి ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదానికి ట్రంప్‌ అయితేనే సరైన వ్యక్తి అని తేల్చిచెప్పాడు. బాధితుల చేతిలో కూడా ఆయుధాలు ఉంటే ఈ ఘటన జరిగేది కాదన్న ట్రంప్‌ మాటలు వర్మకి నిజమేననిపిస్తున్నాయట. ఒక వేళ మంచి వారికి చెడు జరిగితే.. చెడు చేసిన వారికి నువ్వు చెడు చేయాల్సిందే.. అని వ్యాఖ్యానించిన ట్రంప్‌ మాటలకు వర్మ పులకించి పోయి 'హే ట్రంప్‌.. ఐలవ్‌ యు ఫర్‌ దిస్‌ కోట్‌' అంటూ ట్వీట్‌ చేశాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ