సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార ఎప్పుడు ఎవరో ఒకరితో ప్రేమాయణం నడుపుతూ మీడియాలో ప్రముఖంగా కనిపిస్తూ ఉంటుంది. గతంలో ఆమె శింబు, ప్రభుదేవాలతో ప్రేమాయణం సాగించిన సంగతి తెలిసిందే. ప్రభుదేవాతో ఆయితే ఆమె ప్రేమ వివాహం దాకా వచ్చి ఆగిపోయింది. దాంతో ఆమె చాలా అప్‌సెట్ అయింది. అయినా కూడా మరలా ఆమె 'నానుం రౌడీ దాన్' చిత్ర సమయంలో ఆ చిత్ర దర్శకుడు విఘ్నేష్‌శివన్‌తో ప్రేమలో పడిందని, వారిద్దరికి రహస్యంగా పెళ్లి కూడా జరిగిపోయిందని వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత ఇద్దరు ఆ విషయాన్ని ఖండించారు. పెళ్లిని ఖండించినా ఇద్దరి మధ్య ప్రేమ మాత్రం ఉందని ప్రచారం జరుగుతోంది. కానీ తాజాగా ఈ లవ్ కూడా బ్రేకప్ అయిందనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై కోలీవుడ్ మీడియాలో...పాపం.. నయనతారకు ప్రేమలు అసలు అచ్చిరాలేదు. ప్రతి ప్రేమ ఆమెకు క్షోభనే కలిగిస్తోంది. ఇకనైనా ఆమె ప్రేమలకు దూరంగా ఉండటం మంచిదనే ఓదార్పు మాటలు వినిపిస్తున్నాయి. మొత్తానికి అందరూ అయ్యో... నయనా అంటూ జాలి చూపిస్తున్నారు.