Advertisementt

బాలీవుడ్ లో మన లైలా లుక్ అదిరిందిగా..!

Thu 16th Jun 2016 08:51 PM
pooja hegde,bollywood,mohenjo daro movie,ashutosh gowariker,pooja hegde look,august 12th release  బాలీవుడ్ లో మన లైలా లుక్ అదిరిందిగా..!
బాలీవుడ్ లో మన లైలా లుక్ అదిరిందిగా..!
Advertisement
Ads by CJ

'ఒక లైలా కోసం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన పూజ హెగ్డే ఆ సినిమాలో నాగ చైతన్య పక్కన నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఇక రెండో సినిమా 'ముకుందా' లో కూడా గోపికమ్మ గా అందరి మన్ననలు పొందింది. 'ముకుందా' లో ఆమె నటనకు ముగ్దుడై  అశుతోష్ గోవారికర్ ఆమెకు బాలీవుడ్ పిలుపునిచ్చాడు. అక్కడి నుండి ఆమె బాలీవుడ్ బాట పట్టింది. మంచి చారిత్రక నేపధ్యం ఉన్న ‘మొహంజదారో’ సినిమాలో నటించే అవకాశం పూజాకి దక్కింది. ఈ సినిమాలో ఆమె హృతిక్ రోషన్ పక్కన నటిస్తుంది. ఈ సినిమా కోసం ఆమె రెండు సంవత్సరాలుగా కష్టపడుతూ... అక్కడ వచ్చిన మిగతా అవకాశాలను కూడా వదులుకుంది. తాజాగా  ‘మొహంజదారో’ లో పూజా హెగ్డే పాత్రకు సంబంధించి ఒక పోస్టర్ ని విడుదల చేసింది ఆ చిత్ర యూనిట్. ఈ పోస్టర్ లో పూజా అదిరిపోయిందనే చెప్పాలి. దశ తిరిగి ఈ సినిమా హిట్ అయితే పూజా ఇక బాలీవుడ్ లోనే స్థిరపడిపోయినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ‘మొహంజదారో’ లో హృతిక్, పూజా జంటగా నటించగా అశుతోష్ గోవారికర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ‘మొహంజదారో’ సినిమా ఆగష్టు 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ