యంగ్‌టైగర్ ఎన్టీఆర్, మోహన్‌లాల్, సమంత, నిత్యామీనన్ తదితరులు ప్రధానపాత్రల్లో నటిస్తున్న చిత్రం 'జనతాగ్యారేజ్'. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభరోజునే.. చిత్రాన్ని ఆగష్టు 12న విడుదల చేస్తామని యూనిట్ చెప్పింది. అనుకున్న సమయానికే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. షూటింగ్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. ఆగష్టు 12న సినిమాను రిలీజ్ చేస్తే వరుసగా మూడు రోజులు హాలిడేస్ వస్తాయి. దాంతో ఎన్టీఆర్ పంట పండినట్లేనని ట్రేడ్‌వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. అయితే అదే రోజున నాగచైతన్య హీరోగా శృతిహాసన్ కీలకపాత్రలో నటిస్తున్న మలయాళ సూపర్‌హిట్ 'ప్రేమమ్' చిత్రం కూడా విడుదలకు సిద్దమవుతున్న విషయం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ 'జనతాగ్యారేజ్'కి 'ప్రేమమ్' చిత్రంతో కొద్దిపాటి పోటీ తప్పకపోవచ్చు. ఇక కర్ణాటక, తమిళనాడు, కేరళలతోపాటు రెస్టాఫ్ ఇండియా, ఓవర్‌సీస్‌లో కూడా ఎన్టీఆర్‌కు పెద్దపోటీనే ఎదురుకానుంది. హృతిక్‌రోషన్,పూజాహెగ్గే జంటగా అశుతోష్‌గోవిర్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'మొహంజదారో' చిత్రం కూడా అదే రోజున ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్దమవుతోంది. మరి రెస్టాఫ్ ఇండియా, ఓవర్‌సీస్‌లో 'జనతాగ్యారేజ్'కు కావాల్సినని థియేటర్లు దొరుకుతాయా? 'మొహంజదారో' చిత్రం ఎఫెక్ట్ ఎన్టీఆర్ మీద పడుతుందా? అనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది.