Advertisementt

చిరుని చూసి ఎందుకు భయపడుతున్నారు?

Sat 18th Jun 2016 05:01 PM
chiranjeevi,dance practice,150th movie,mega star,allu arjun,ram charan,fear  చిరుని చూసి ఎందుకు భయపడుతున్నారు?
చిరుని చూసి ఎందుకు భయపడుతున్నారు?
Advertisement
Ads by CJ

అవును మన మెగా హీరోలు చిరంజీవిని చూసి భయపడుతున్నారట. ఎందుకంటారా చిరు డాన్స్ చూసి.  చిరంజీవిని డాన్సు లో బీట్ చెయ్యడం ఎవ్వరివల్లా కాదనేది నగ్న సత్యం. ఎంత గొప్ప డాన్సర్స్ వచ్చినా చిరంజీవిని తలదన్నే వారే లేరు. అయితే ఇప్పుడు కథంతా ఎందుకంటే ఆయన తన 150 వ చిత్రం కోసం ఒళ్ళు తగ్గించే పనిలో ఉన్నాడట. ఆ ఒళ్ళు తగ్గడానికి చిరంజీవి ఏ జిమ్ములకు వెళ్ళడం లేదట. తనకు తెలిసిన విద్యనే అభ్యసిస్తున్నాడట. ఇంతకి చిరు ఒళ్ళు తగ్గించడానికి ఎన్నుకున్న మార్గం ఏమిటి అనుకుంటున్నారా..ఇంకేముంటుంది..డాన్స్. చిరు తన ఇంట్లోనే డాన్స్ రూంలో డాన్స్ ప్రాక్టిస్ చేస్తున్నాడట. చిరంజీవి చేసే స్టెప్స్ చూసి రామ్ చరణ్, అల్లు అర్జున్ లు భయపడుతున్నారట. డాన్సులో ఆయన వారసత్వం అందుకోగలరేగాని ఆయనలా ఎవ్వరూ డాన్స్ చెయ్యలేరని తెలుసుకుని చిరంజీవి దగ్గర వాళ్ళు డాన్స్ లో ఉన్న కిటుకులు, మెలకువలు నేర్చుకుంటున్నారట. దట్ ఇజ్ చిరు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ