Advertisementt

యంగ్‌టైగర్‌ లో మెగాస్టార్ లక్షణం!

Sun 19th Jun 2016 07:15 PM
young tiger ntr,chiranjeevi,fans,jr ntr fans,janatha garage  యంగ్‌టైగర్‌ లో మెగాస్టార్ లక్షణం!
యంగ్‌టైగర్‌ లో మెగాస్టార్ లక్షణం!
Advertisement
Ads by CJ

గత కొన్నేళ్లుగా యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ కెరీర్‌ ఒడిదుడుకుల మధ్య సాగుతోంది. ఆయన సినిమాలు హిట్టవుతున్నా కూడా అవి ఆయన స్ధాయిహిట్లు మాత్రం కాదు. 'నాన్నకు ప్రేమతో' చిత్రం హిట్‌ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ ఓవర్‌బడ్జెట్‌తో పాటు నందమూరి అభిమానుల్లో వచ్చిన చీలిక కారణంగా కూడా ఈ చిత్రం ఆ స్దాయికి తగ్గ కలెక్షన్లను సాధించలేకపోయింది. దీంతో ఎన్టీఆర్‌ తన ఫ్యాన్స్‌పై దృష్టి సారించాడు. కేవలం నందమూరి అభిమానులనే కాకుండా న్యూట్రల్‌గా ఉండే అభిమానులను కూడా పెంచుకోవాలని డిసైడ్‌ అయ్యాడు. ఒకప్పుడు ఎన్టీఆర్‌ను ఆయన అభిమానులు కలవాలంటే పడిగాపులు కాయాల్సివచ్చేది. చివరి దాకా కలుస్తానని నిల్చోబెట్టి ఆ తర్వాత వారికి చెప్పాపెట్టకుండా షూటింగ్‌ స్పాట్‌ నుండి వెళ్లిపోయేవాడు. ఎవరితో ఆప్యాయంగా మాట్లాడే వాడు కాదు. మహా అయితే ఇద్దరు ముగ్గురు అభిమానుల విషయంలోనే ఆయన ఎక్కువ ఆప్యాయత చూపించేవాడు. ఇది ఆయనకు ఉన్న ఇమేజ్‌ను బాగా దెబ్బతీసింది. తాజాగా తారక్‌ సినిమా షూటింగ్‌ స్పాట్‌లో కూడా తనను కలవడానికి వచ్చిన అభిమానులను బాగా రిసీవ్‌ చేసుకుంటున్నాడు. వారికంటూ కొద్ది సమయం కేటాయించి ఫొటోలు తీసుకొని వారి బాగోగులను అడిగి తెలుసుకుంటున్నాడు. ఇది తెలిసిన అభిమానులు మరలా ఎన్టీఆర్‌కు చేరువకావడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. గతంలో చిరంజీవిలో ఈ లక్షణం పుష్కళంగా కనిపించేది. షూటింగ్‌ స్పాట్‌కు వచ్చిన అభిమానులను పలకరించడానికి ఆయన సినిమా షూటింగ్‌ పేకప్‌ అయినా గంటల కొద్ది వారితో గడిపేవాడు. వారిని పేరు పేరునా ఆప్యాయంగా పిలిచేవాడు. ఇప్పుడు అదే రూట్‌ను ఎన్టీఆర్‌ ఫాలో అవుతుండటం పట్ల అభిమానులు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఇటీవల చెన్నైలో జరిగిన 'జనతాగ్యారేజ్‌' షూటింగ్‌ స్పాట్‌లో ఎన్టీఆర్‌లో మార్పు స్పష్టంగా కనిపించింది. ఆయన ఏకంగా మూడు గంటలపాటు అక్కడికి వచ్చిన అభిమానులతో ఆప్యాయంగా మాట్లాడుతూ, వారితో కలిసి ఫొటోలు దిగుతూ కనిపించాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ