Advertisementt

బాలయ్యకు బలమైన సెంటిమెంట్‌...!

Tue 21st Jun 2016 12:46 PM
balakrishna,nadia,balayya sentiment,rajamatha hema malini,shriya,hit movies  బాలయ్యకు బలమైన సెంటిమెంట్‌...!
బాలయ్యకు బలమైన సెంటిమెంట్‌...!
Advertisement
Ads by CJ

తన 100వ చిత్రం 'గౌతమీ పుత్రశాతకర్ణి' విషయంలో బాలయ్య చాలా విషయాలు సెంటిమెంట్‌గా ఫీలవుతున్నాడు. తన తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్‌ చిత్రంతో బాలనటునిగా పరిచయమైన తాను ఇప్పుడు తన చిత్రం ద్వారా తన తనయుడు నందమూరి మోక్షజ్ఞను నటునిగా పరిచయం చేస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో రాజమాతగా హేమమాలిని నటిస్తుండగా, మహారాణిగా శ్రియ నటిస్తోంది. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి మరో మంచి సెంటిమెంట్‌ కలిసొచ్చింది. తన రీఎంట్రీలో ఒక్క 'బ్రూస్‌లీ' మినహా మరో ఫ్లాప్‌ లేకుండా 'మిర్చి, అత్తారింటికి దారేది, దృశ్యం, అ... ఆ' వంటి సూపర్‌హిట్‌ చిత్రాలతో దూసుకుపోతున్న సీనియర్‌ ఆర్టిస్ట్‌ నదియా ఈ చిత్రంలో ఓ కీలకపాత్రకు ఎంపికైందని సమాచారం. మరి నదియా చేయనున్న క్యారెక్టర్‌ ఏమిటో? ఇంకా స్పష్టత రావడం లేదు. మొత్తానికి బాలయ్య 100వ చిత్రానికి నదియా సెంటిమెంట్‌ కూడా వర్కౌట్‌ అవుతుందనే నమ్మకంతో యూనిట్‌ ఉంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ