Advertisementt

పాతరూటులో చైతూ..!

Tue 21st Jun 2016 12:59 PM
naga chaitanya,old route,class movies,mass movies,sahasam swasaga sagipo,gautham menon  పాతరూటులో చైతూ..!
పాతరూటులో చైతూ..!
Advertisement
Ads by CJ

'జోష్‌'తో హీరోగా తెరంగేట్రం చేసి మొదటి సినిమాతో ఫ్లాప్‌ను చవిచూసిన అక్కినేని వంశాంకురం నాగచైతన్య. కానీ ఆయనకు రావాల్సిన హిట్‌ను గౌతమ్‌మీనన్‌ ఆయన రెండో చిత్రం 'ఏమాయ చేసావో'తో ఇచ్చాడు. ఈ చిత్రం నాగచైతన్యకు మంచి క్లాస్‌ హీరోగా పేరు తీసుకొచ్చింది. కానీ ఆయన క్లాస్‌ బాటను వీడి మాస్‌, యాక్షన్‌ అంటూ చేసిన చిత్రాలన్నీ ఆయనకు ఫ్లాప్‌లనే తీసుకొచ్చాయి. ఒక్క 'తడాఖా' చిత్రం మాత్రం ఓకే అనిపించింది. తమిళ రీమేక్‌ కావడం, అందులో సునీల్‌ కూడా హీరోగా నటించడంతో ఆ హిట్‌ క్రెడిట్‌ పూర్తిగా ఆయనకే చెందలేదు. ఇక ఆ తర్వాత చేసిన 'ఆటోనగర్‌ సూర్య, ఓ లైలా కోసం' తో పాటు 'దోచెయ్‌'తో చైతూ కెరీర్‌ గాడితప్పింది. ఇక తరవాత 'మనం' చిత్రం హిట్టయినా కూడా ఆ క్రెడిట్‌ ఆయన ఒక్కడి సొంతం కాలేదు. దీంతో తనకు తొలిహిట్టును ఇచ్చిన గౌతమ్‌మీనన్‌ దర్శకత్వంలోనే ఆయన ఇప్పుడు 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రం చేస్తున్నాడు. మొత్తానికి గౌతమ్‌మీనన్‌ తనకు మరో మంచి హిట్టు ఇస్తాడనే ఆశతో చైతూ ఉన్నాడు. ఇక ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆడియోలోని రహ్మాన్‌ అందించిన ట్యూన్స్‌ యూత్‌ను బాగా ఆకట్టుకుంటున్నాయి.ఈ చిత్రంతోపాటు నాగచైతన్య మలయాళంలో సూపర్‌హిట్‌ అయిన 'ప్రేమమ్‌' చిత్రం కూడా ఆగష్టులో విడుదలకు సిద్దమవుతోంది. ఇది కూడా యూత్‌ బేస్‌డ్‌ రొమాంటిక్‌ అండ్‌ క్లాస్‌ మూవీనే కావడం విశేషం. ఈరెండు చిత్రాలపై నాగచైతన్యకే కాదు... అక్కినేని వంశానికి, అక్కినేని అభిమానులకు భారీ ఆశలు ఉన్నాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ