స్వీటీ అనుష్క డేర్‌ను ఇప్పుడు ఇండస్ట్రీలోని అందరూ బాగా మెచ్చుకుంటున్నారు. ఓ వైపు 'అరుంధతి, వర్ణ, సైజ్‌జీరో, రుద్రమదేవి' వంటి చిత్రాలు చేస్తూనే మరోవైపు 'వేదం, బాహుబలి' వంటి చిత్రాల్లో నటించి మెప్పిస్తోంది. త్వరలో ఆమె చేయబోయే 'భాగమతి' చిత్రం కూడా ఓ లేడీ ఓరియంటెడ్ థ్రిల్లర్ సస్పెన్స్‌గా రూపొందనున్న చిత్రమే. మరోవైపు విడుదలకు సిద్దమవుతోన్న 'సింగం' సీక్వెల్ 'ఎస్3'లో కూడా ఆమె గ్లామర్ డాల్‌గా చేస్తోంది. తాజాగా ఆమె నాగార్జున హీరోగా కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందనున్న శ్రీవేంకటేశ్వరస్వామి ప్రియభక్తుడైన హథీరాం బాబా జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న 'ఓం నమో వేంకటేశాయ' చిత్రంలో ఓ సన్యాసి పాత్రను చేయడానికి ఒప్పుకున్న సంగతి తెలిసిందే . మొత్తానికి తనపై తనకు ఉన్న నమ్మకంతో పాటు గ్లామర్‌రోల్, పర్‌ఫార్మెన్స్ ఓరియంటెడ్ చిత్రాల ద్వారా కూడా తాను ప్రేక్షకులను మెప్పించగలననే నమ్మకంతోనే ఆమె ఇంతటి డేరింగ్ స్టెప్స్ తీసుకొంటోందని చెప్పవచ్చు.