తమిళస్టార్ సూర్యకు తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల ఆయన నటించిన '24' చిత్రం విడుదలై మంచి టాక్ సంపాదించింది. ఈ చిత్రానికి మంచి పేరైతే వచ్చింది కానీ కలెక్షన్లు మాత్రం పెద్దగా రాబట్టలేకపోయింది. ఈ చిత్రానికి తమిళంలో కంటే తెలుగులోనే ఎక్కువ పేరు రావడం విశేషం.ఈ చిత్రం తమిళ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దాంతో త్రివిక్రమ్ డైరెక్షన్‌లో సూర్య హీరోగా తెలుగు, తమిళ భాషల్లో తీయాలనుకున్న చిత్రం కూడా వాయిదా పడింది. ఇక ప్రస్తుతం సూర్య తాను ఎప్పుడు డౌన్‌ఫాల్‌లో ఉన్నా తనకు మంచి హిట్టును ఇచ్చే దర్శకుడు హరి దర్శకత్వంలో 'సింగం' సీక్వెల్‌గా 'ఎస్‌త్రీ' చేస్తున్న సంగతి తెలిసిందే. ఈచిత్రం షూటింగ్ వేగంగా జరుగుతోంది. అయితే ఈ చిత్రం 'సింగం'కు సీక్వెల్‌కాదని, కేవలం సూర్య క్యారెక్టర్‌ను మాత్రమే తీసుకొని కొత్త కథతో తీస్తున్న చిత్రమని ఇప్పటికే యూనిట్ ప్రకటించింది. సూర్య సరసన ఈ చిత్రంలో అనుష్క, శృతిహాసన్‌లు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగష్టులో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రం తర్వాత ప్రస్తుతం తమిళంలో అందరి దృష్టిని ఆకట్టుకుని కేవలం టీజర్‌తోనే స్టార్ హీరోలను కట్టిపడేసిన 'కబాలి' దర్శకుడు రంజిత్‌పా దర్శకత్వంలో సూర్య తన సొంత బేనర్‌లో ఓ చిత్రం చేయనున్నాడు. మరి ఈ రెండు చిత్రాలైనా సూర్యకు పూర్వవైభవం తీసుకొని వస్తాయో లేదో వేచిచూడాల్సివుంది.