బంగారు తెలంగాణ సాధన ప్రక్రియలో తన వంతు భాగస్వామ్యం కోసం కృషి చేసిన ఆచార్య జయశంకర్ వర్ధంతి సందర్బంగా తెలంగాణ ప్రభుత్వంపై జేఏసీ చైర్మన్ కోదండరాం మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. జయశంకర్ తెలంగాణ ప్రజలందరి అభ్యున్నతిని కోరే తెలంగాణ కోరుకున్నారని, కానీ ప్రస్తుత ప్రభుత్వ తరహాలో కాంట్రాక్టర్లకు,రియల్టర్లకు లబ్దిని చేకూర్చే తెలంగాణను ఆయన కోరుకోలేదని విమర్శలు సంధించారు. అయితే ఇటీవల కాలంలో కోదండరాం టిఆర్‌ఎస్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. జయశంకర్ కోరుకున్న తెలంగాణ తేవడం చేతకాకపోతే పదవి నుంచి దిగిపోవాలని ఆయన గతంలో కూడా విమర్శించారు. కోదండరాం వ్యాఖ్యలపై తెలంగాణలోని టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో పాటు చోటా నాయకులు కూడా కోదండరాం విమర్శలపై తీవ్రపదజాలం వాడుతూ దూషించడంతో దానివల్ల తమ పార్టీని నష్టం చేకూరుస్తుందని కేసీఆర్ భావించి కోదండరాంపై విమర్శలు చేయవద్దని ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే మరోసారి కోదండరాం కాంట్రాక్టర్లకు, రియల్టర్లకు లభ్ది చేకూరుస్తున్న ప్రభుత్వం వద్దని వ్యాఖ్యలు చేయడంతో తెరాస వర్గాలు ఈసారి కూడా కోదండరాంపై ప్రతివిమర్శలు చేస్తారా? లేక మౌనంగా ఉంటారా? అనేది ఆసక్తిని కలిగిస్తోంది.