Advertisementt

స్వామితో పెట్టుకుంటే ఇంతే సంగతులు....!

Thu 23rd Jun 2016 08:22 PM
subramanian swamy swami eye arvind kejriwal sonia jayalalitha rbi governor raghuram rajan  స్వామితో పెట్టుకుంటే ఇంతే సంగతులు....!
స్వామితో పెట్టుకుంటే ఇంతే సంగతులు....!
Advertisement
Ads by CJ

కేంద్రమాజీ మంత్రిగా కంటే ఎన్నో రెట్లు ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్న నాయకుడు సుబ్రహ్మణ్యస్వామి. ఆయన కన్ను ఎవరిపైనైనా పడిందంటే వారి సంగతి తేల్చేదాకా ఆయన నిద్రపోడు, వారిని నిద్రపోనివ్వడు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు, సోనియా, రాహుల్‌లపై నేషనల్‌ హెరాల్డ్‌ కేసు.. ఇలా ఎన్నింటినో ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. తాజాగా రెండోసారి ఆర్బీఐ గవర్నర్‌గా కొనసాగాలని ఆశించిన రాఘురామరాజన్‌ చేత తనకు ఆ పదవి రెండోసారి వద్దు అనిపించిన ఘనత స్వామిది. కాగా సుబ్రహ్మణ్యస్వామి కన్ను ప్రస్తుతం క్రేజీవాల్‌పై పడిందని సమాచారం. వాస్తవానికి పై స్దాయిలో ఉన్న రాజకీయనాయకులకు ఎవరినుండైనా చికాకులు వస్తుంటే వారు ఎంత ఖర్చయినా సరే ఆ కేసును స్వామికే అప్పజెబుతారు. అయితే గత కొంతకాలంగా మోడీని టార్గెట్‌ చేస్తోన్న డిల్లీ సీఎం క్రేజీవాల్‌పై ఆయన కన్నుపడిందని సమాచారం. ఆయన్ను ఎలాగైనా ఓ ఆట ఆడుకోవాలనే మోడీ కోరికను తాను తీరుస్తానని స్వామి బిజెపి అగ్రనాయకులకు హామీ ఇచ్చాడట. మరి తిమ్మిని బమ్మిని చేసే సుబ్రహ్మణ్యస్వామి ఏ విషయంలో కేజ్రీవాల్‌ను టార్గెట్‌ చేయనున్నాడనే విషయం తెలియడానికి మరి కొంత కాలం వెయిట్‌ చేయక తప్పదు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ