ఏదో ఒక్క హిట్ ఇస్తేనే టాలీవుడ్‌లో నిర్మాతలు ఆయా దర్శకుల చుట్టు డేట్స్‌కోసం తిరుగుతూ ఉంటారు. అలాంటిది వరుస హిట్లు, మినిమం గ్యారెంటీ చిత్రాలను అందించే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే ఇక చెప్పాల్సిన పనిలేదు. నార్మల్ కాస్టింగ్‌తో అతి మామూలు పబ్లిసిటీతో వచ్చిన 'అ..ఆ' చిత్రం సూపర్‌హిట్ అయి కాసుల వర్షం కురిపిస్తుండటంతో ఇప్పుడు త్రివిక్రమ్‌తో పనిచేయాలని చాలా మంది స్టార్స్ ఎదురుచూస్తున్నారు. ఆయనతో పనిచేయాలని భావిస్తున్న స్టార్స్ విషయానికి వస్తే పవన్, మహేష్, ప్రభాస్, బన్నీ, ఎన్టీఆర్, రామ్‌చరణ్, అఖిల్.. ఇలా పెద్ద లిస్టే ఉంది. కానీ ప్రస్తుతానికి అఖిల్ తప్ప మిగిలిన స్టార్స్ అంతా తమ తమ చిత్రాలతో బిజీ బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ 'జనతాగ్యారేజ్', ఆ తర్వాత వక్కంతం వంశీ, పవన్ డాలీ చిత్రం, రామ్‌చరణ్ 'దృవ', ఆ తర్వాత సుకుమార్ చిత్రం. బన్నీ లింగుస్వామి, ఆ తర్వాత విక్రమ్‌కె కుమార్‌ల చిత్రాలు. మహేష్ మురుగదాస్ చిత్రం.. ఇలా అందరూ ముందస్తు కమిట్‌మెంట్స్‌తో బిజిబిజీగా ఉన్నారు. మరి త్రివిక్రమ్‌కు ఉన్న ఒకే ఒక్క ఆప్షన్‌గా అఖిల్ కనిపిస్తున్నాడు. లేదా సూర్యతో అనుకుని వాయిదా పడిన ప్రాజెక్ట్ మరలా పట్టాలెక్కుతుందో చూడాలి..! లేక స్టార్ హీరోలు తమ చిత్రాలను పూర్తి చేసే వరకు త్రివిక్రమ్ ఖాళీగా ఉండి, స్క్రిప్ట్స్ విషయంలో బిజీగా ఉంటాడేమో చూడాలి...!