ఈ మధ్య స్టార్‌హీరోలు కూడా ఫాదర్ సెంటిమెంట్, మదర్ సెంటిమెంట్ వంటి సున్నిత బంధాల చుట్టూ తిరిగే సినిమాలపై ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవలే ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'నాన్నకు ప్రేమతో' చిత్రం ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే తరహా ఫాదర్ సెంటిమెంట్ చిత్రంలో మెగామేనల్లుడు సాయిధరమ్‌తేజ్ నటిస్తున్నాడు. ఆయన ప్రస్తుతం 'తిక్క' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం స్టోరీ ఫాదర్ సెంటిమెంట్ పాయింట్‌తో తెరకెక్కనుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన హృద్యమైన మాటలను రాయడంలో రచయిత శ్రీధర్ సీపాన బిజీగా ఉన్నాడు. 'తిక్క' చిత్రం విడుదలైన వెంటనే గోపీచంద్ మలినేని-సాయిధరమ్‌తేజ్‌ల చిత్రం పట్టాలెక్కనుంది.