Advertisementt

బాలయ్య తదుపరి చిత్రాలపై క్లారిటీ...!

Sun 26th Jun 2016 05:59 PM
balakrishna,gauthami putra satakarni,next movies,raitu rajyam movie,krishna vamshi  బాలయ్య తదుపరి చిత్రాలపై క్లారిటీ...!
బాలయ్య తదుపరి చిత్రాలపై క్లారిటీ...!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం నందమూరి నటసింహం బాలకృష్ణ తన 100వ చిత్రాన్ని క్రిష్‌ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. 'గౌతమీపుత్ర శాతకర్ణి' జీవిత చరిత్ర ఆధారంగా అదే పేరుతో తెరకెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్‌ వేగంగా జరుగుతోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనేది బాలయ్య ఆలోచన. అయితే బాలయ్య వందో చిత్రం కోసం క్రియేటివ్‌ జీనియస్‌ కృష్ణవంశీ సైతం ఆయనకు రైతు సమస్యలతో కూడిన 'రైతురాజ్యం' అనే పవర్‌ఫుల్‌ స్టోరీని చెప్పిన సంగతి తెలిసిందే. సో.. బాలయ్య 101వ చిత్రంగా కృష్ణవంశీ దర్శకత్వంలో 'రైతురాజ్యం' చేయాలనేది బాలయ్య ఆలోచనగా చెబుతున్నారు. ఇక ఆ తర్వాతి చిత్రానికి అంటే 102వ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించనున్నాడని సమాచారం. ఈ విధంగా చూసుకుంటే నటునిగా బాలయ్య మరో రెండేళ్ల వరకు తన డైరీని ఫుల్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ