Advertisementt

బాబుకు గవర్నర్‌పై కోపం తగ్గలేదా...?

Sun 26th Jun 2016 07:06 PM
chandrababu naidu,governor,2 states,ap,telangana,kcr  బాబుకు గవర్నర్‌పై కోపం తగ్గలేదా...?
బాబుకు గవర్నర్‌పై కోపం తగ్గలేదా...?
Advertisement
Ads by CJ

రాష్ట్రం విడిపోయి రెండుగా మారినప్పటి నుండి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ తెలంగాణ విషయంలో చూపిస్తున్న ఉత్సాహం ఏపీపై చూపడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఏపీని పక్షపాత దోరణిలో చూస్తున్నాడని స్వయంగా టిడిపి నేతలే కామెంట్స్‌ చేస్తున్నారు. ఇప్పుడు ఆ కోపం వల్లే చంద్రబాబు గవర్నర్‌కు హ్యాండిచ్చాడనే వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇటీవల ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ ఇఫ్తార్‌ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ, ఏపీ సీఎంలిద్దరినీ ఆయన ఆహ్వానించారు. కానీ ఈ కార్యక్రమానికి కేసీఆర్‌ వచ్చినా కూడా చంద్రబాబు మాత్రం డుమ్మాకొట్టాడు. దాంతో చంద్రబాబు ఈ ప్రోగ్రాంకు ఎందుకు రాలేదని అక్కడి వారు గుసగుసలాడుకున్నారట. దీంతో పరిస్థితి గమనించిన గవర్నర్‌ తాను ఇద్దరు సీఎంలను ఆహ్వానించానని, తాను రెండు రాష్ట్రాలు అభివృధ్ది పధంలో దూసుకుపోవాలని కోరుకుంటున్నానని వివరణ ఇచ్చేంత వరకు ఈ చర్చ సాగింది. అయినా చంద్రబాబు బిజీగా ఉండి ఇఫ్తార్‌ విందుకు రాలేదా? లేక కావాలనే గవర్నర్‌పై తనకున్న కోపం వల్లే రాలేదా? అనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. దీనిపై చంద్రబాబు ఎలా స్పందిస్తాడో చూడాలి....! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ