Advertisementt

27 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టనున్న సూపర్‌స్టార్‌!

Mon 27th Jun 2016 06:06 PM
rajinikanth,kabali,27 years record,ranjit pa,basha movie  27 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టనున్న సూపర్‌స్టార్‌!
27 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టనున్న సూపర్‌స్టార్‌!
Advertisement
Ads by CJ

సౌతిండియన్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా రియలిస్టిక్‌ చిత్రాల దర్శకుడు రంజిత్‌పా దర్శకత్వంలో కలైపులి థాను నిర్మిస్తున్న తాజా చిత్రం 'కబాలి'. ఇప్పటికే టీజర్లతో, ఆడియోతో ఈ చిత్రం అంతటా సంచలనం సృష్టిస్తోంది. 'బాషా' తర్వాత ఆ స్దాయిలో అదే తరహా గెటప్‌లో రజనీ నటిస్తున్న ఈ చిత్రం 'బాషా'లాగానే సంచలన విజయం సాధించి మరో కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుడుతుందని కోలీవుడ్‌, టాలీవుడ్‌ వర్గాలు భావిస్తున్నాయి. రజనీకాంత్‌ వంటి స్టార్‌డమ్‌ ఉన్న హీరోని కొత్త అంటే కేవలం రెండు చిత్రాల అనుభవమే ఉన్న రంజిత్‌పా తెరపై ఆయన్ను ఏవిధంగా చూపించనున్నాడనే ఆసక్తి అందరిలోనూ కలిగిస్తోంది. అయితే ఈచిత్రానికి మరో ప్రత్యేకత కూడా ఉందని తెలుస్తోంది. ఈ చిత్రం ప్రారంభమైన 15 నిమిషాల దాకా రజనీకాంత్‌ ఇంట్రో ఉండదని సమాచారం. 15 నిమిషాల తర్వాతే ఆయన ఇంట్రడక్షన్‌ ఉంటుందని కోలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. రజనీ వంటి స్టార్‌ చిత్రం అంటే అభిమానులు, ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు ఆయన తెరపై కనిపిస్తాడా? అని వేయికళ్లతో ఎదురుచూస్తారు. కానీ రంజిత్‌ 15 నిమిషాల పాటు రజనీని చూపించకుండా సినిమాను ఎలా నడిపిస్తాడు? అనేది ఉత్కంఠను కలిగిస్తోంది. గతంలో మణిరత్నం దర్శకత్వంలో రజనీకాంత్‌, మమ్ముట్టి, అరవింద్‌స్వామిలు కలిసి నటించిన 'దళపతి' చిత్రంలో రజనీ 13 నిమిషాల తర్వాత తెరపై ప్రత్యక్షమవుతాడు. ఆ రికార్డును ఇప్పుడు 'కబాలి' బ్రేక్‌ చేయనుంది. ఇక ఆయన నటించిన 'కథానాయకుడు' చిత్రంలో కూడా రజనీ సినిమా ప్రారంభమైన చాలాసేపు తెరపై కనిపించడు. కానీ ఆ చిత్రంలో రజనీ చేసింది కేవలం కామియో పాత్ర మాత్రమే. మరి ఈ విషయంలో రంజిత్‌పా తన టాలెంట్‌ను తెరపై ఎలా చూపించనున్నాడో చూడాలి...! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ