Advertisementt

శింబు ఇంక మారవా!..అంటూ లెటర్స్!

Tue 28th Jun 2016 07:41 PM
simbu,sahasam swasaga sagipo movie,gautham menen,fans letters to simbu,  శింబు ఇంక మారవా!..అంటూ లెటర్స్!
శింబు ఇంక మారవా!..అంటూ లెటర్స్!
Advertisement
Ads by CJ

కోలీవుడ్‌లో తన చిత్రాల ద్వారా కాకుండా వ్యక్తిగత విషయాల్లో కూడా ఎప్పుడూ వివాదాలలో ఉండే హీరో ఎవరంటే శింబునే. ఆయనకు దర్శకుడు గౌతమ్‌మీనన్‌కు ఉన్న సాన్నిహిత్యం అందరికీ తెలిసిందే. 'విన్నై తాండి వరువాయ' (తెలుగులో 'ఏమాయచేసావే') వంటి పెద్ద హిట్‌ను ఇతనికి ఇచ్చాడు గౌతమ్‌మీనన్‌. కాగా 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రం తమిళ వెర్షన్‌లో కూడా శింబునే హీరో. ప్రస్తుతం శింబుకు, గౌతమ్‌కు మద్య మనస్పర్దలు వచ్చాయని కోలీవుడ్‌ సమాచారం. అందుకే తెలుగు 'సాహసం శ్వాసగా సాగిపో' ఆడియో రిలీజ్‌కు శింబుకు ఆహ్వానం ఇవ్వలేదని, తమిళ వెర్షన్‌ ఆడియోను ఇప్పటివరకు రిలీజ్‌ చేయలేదని సమాచారం. దీంతో గౌతమ్‌పై కోపంతో శింబు ఈ చిత్రం బ్యాలెన్స్‌ ఉన్న షూటింగ్‌ పార్ట్‌కు హాజరుకావడం లేదని తెలుస్తోంది. శింబు వల్లే తమిళ వెర్షన్‌ షూటింగ్‌ లేటవుతోందని, అందుకే దర్శకుడు గౌతమ్‌ శింబుపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. గౌతమ్‌ మాత్రమే కాదు శింబు ఫ్యాన్స్ కూడా ఈ విషయంలో శింబు పై కోపంగా వున్నారు. శింబు ఇకనైనా మారు అంటూ ఫ్యాన్స్ లెటర్స్ కూడా శింబు కి వస్తున్నాయంటే..ఫ్యాన్స్ శింబు తీరుపై ఎంతగా ఫీల్ అవుతున్నారో అర్ధమవుతోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ