Advertisementt

వీళ్లేనా శాతకర్ణి కొడుకులు!?

Wed 29th Jun 2016 02:30 PM
gautamiputra satakarni,balakrishna,songs,mokshagan,nara rohit,satakarni songs  వీళ్లేనా శాతకర్ణి కొడుకులు!?
వీళ్లేనా శాతకర్ణి కొడుకులు!?
Advertisement
Ads by CJ

ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ హీరోగా ఆయన నటిస్తున్న వందో చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి' రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని క్రిష్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కాగా వైవిధ్య పాత్రలు, వైవిధ్య చిత్రాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న హీరో నారారోహిత్‌ ఈ చిత్రంలో నటించనున్నట్లు సమాచారం. శాతకర్ణి జీవిత చరిత్ర ప్రకారం ఆయనకు ఇద్దరు కుమారులు. ఒక కుమారుడిగా నారారోహిత్‌ నటించనుండగా, చిన్న కుమారుడిగా నందమూరి మోక్షజ్ఞ కనిపించనున్నాడని విశ్వసనీయ సమాచారం. మరి ఈ వార్త నిజమో కాదో తెలియాంటే కొద్దికాలం ఆగాలి. కాగా ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. జులైలో మరో భారీషెడ్యూల్‌ను విదేశాల్లో ప్లాన్‌ చేశారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ