Advertisementt

బాలయ్యకి 101 కూడా ఫిక్స్ అయ్యింది!

Wed 29th Jun 2016 03:33 PM
balakrishna,krishnavamsi,101 movie raitu,raitu rajyam,krish,gowthami putra satakarni,chiranjeevi,kattilantodu  బాలయ్యకి 101 కూడా ఫిక్స్ అయ్యింది!
బాలయ్యకి 101 కూడా ఫిక్స్ అయ్యింది!
Advertisement
Ads by CJ

బాలకృష్ణ తన 100 వ చిత్రంగా క్రిష్ డైరెక్షన్ లో 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమా చేస్తున్నాడు. ఇక తన 100 వ  చిత్రం సెట్స్ మీద ఉండగానే ఇప్పుడు 101 వ చిత్రం గురుంచి తొందరపడుతున్నాడు. తన 101 వ చిత్రాన్ని కృష్ణవంశీ డైరెక్షన్ లో చేస్తున్నట్లు బాలకృష్ణ ప్రకటించాడు. 101 వ చిత్రానికి 'రైతు' అనే టైటిల్ ని రిజిస్టర్ చేయించారని సమాచారం. అసలు 100 వ చిత్రమే కృష్ణవంశీ డైరెక్షన్ లో 'రైతు రాజ్యం' ఉంటుందని అన్నప్పటికీ అనూహ్యం గా క్రిష్ లైన్ లోకి వచ్చి 'గౌతమీపుత్ర శాతకర్ణి' పట్టాలెక్కించాడు. అయితే బాలకృష్ణ తన తదుపరి చిత్రం 'రైతు' ని 'గౌతమీపుత్ర శాతకర్ణి' విడుదలైన తరువాత మొదలు పెడతాడని సమాచారం. ఈ చిత్రం రైతుల గురించి, వారి సమస్యల గురించి ఉంటుందని సమాచారం. ఇదిలా ఉండగా రైతు సమస్యలతో చిరంజీవి తన 150 చిత్రం గా 'కత్తిలాంటోడు' ని వి.వి.వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ