భారతదేశంలో సంస్కరణలను ప్రవేశపెట్టి నేటితరం ఇండియా సృష్టికర్తగా నిలిచిన వ్యక్తి దివంగత మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు. ఆధునిక ఇండియా రూపకర్త అయిన పివి ని సోనియాతో పాటు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా అవమానించిందని ఆయన మనవడు ఇటీవల సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీనిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూనే ఉంది. కాగా పివి కి భారతరత్నను ఇవ్వాలని మోడీ సర్కార్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పివికి భారతరత్న ఇవ్వడం ద్వారా అటు కాంగ్రెస్‌పార్టీకి ఇబ్బందులు కలిగించడమే కాక తాము పక్షపాతం లేకుండా అందరినీ సమానంగా చూస్తున్నామనే ఘనతను, పేరును ఒకేసారి సాధించవచ్చని మోడీ సర్కార్ భావిస్తోంది. త్వరలోనే ఈ విషయమై మోడీ సర్కార్ నిర్ణయం తీసుకోనుంది. దార్శకునిగా పేరుతెచ్చుకున్న పివికి ఏవిధంగానైనా సరే భారతరత్న ఇస్తే అది దేశ ప్రజలకు, మరీ ముఖ్యంగా తెలుగు ప్రజలకు లభించిన సరైన గౌరవంగా భావించవచ్చు.