Advertisementt

కేవలం హిందువులకు మాత్రమే ఈ జీవో..!

Thu 30th Jun 2016 08:57 PM
ap government,hindus,christians,muslims,and,go 425,go 425 controversy  కేవలం హిందువులకు మాత్రమే ఈ జీవో..!
కేవలం హిందువులకు మాత్రమే ఈ జీవో..!
Advertisement
Ads by CJ

ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ఈమధ్య వివాదాస్పదం అవుతున్నాయి. వీటిని ప్రతిపక్షాలు బాగా క్యాష్‌ చేసుకుంటున్నాయి. దేవాదాయశాఖకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఓ జీవో ఇప్పుడు అన్నిచోట్లా వివాదాస్పదమవుతోంది. దేవాదాయశాఖకు సంబంధించిన భూములపై ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం. 425 ఇప్పుడు ఈ వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. ఈ జీవో ప్రకారం దేవాదాయ శాఖ పరిధిలోని భూములను కేవలం హిందువులు మాత్రమే సాగు చేసుకోవాలి. అంటే హిందుయేతరులకు దేవాలయ భూములు సాగు చేసుకునే అవకాశం ఇక లేదు. అలాగే దేవాదాయ శాఖ పరిధిలోని భూముల సాగువిషయంలో దళితుల విషయంలో కూడా ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. దళితులు కనుక ఆ భూములను సాగు చేయాలని భావిస్తే సమీప చర్చి నుండి 'నాన్‌ క్రిష్టియన్‌' సర్టిఫికేట్‌ను తేవడం తప్పనిసరి చేసింది. దీనిపై దళితులు, ముస్లింలతో పాటు విపక్షాలు ఈ జోవోపై మండిపడుతున్నాయి. అయితే ఈ రోజుల్లో దళితులే గాక పలు కులాల వారు కూడా క్రిస్టియన్‌ మతం పుచ్చుకుంటున్నారు. కానీ మిగిలిన కులాలను వదిలేసి కేవలం దళితుల విషయంలోనే ఈ మెలిక పెట్టడం ఏమిటని? కొందరు ప్రశ్నిస్తున్నారు. ఆల్‌రెడీ హిందు దేవాలయాలకు సంబంధించి భూములను సాగు చేసుకుంటున్న దళితులు, ముస్లింలు ఎవరైనా ఉంటే వెంటనే ఆ భూమిని సాగుచేయడం ఆపి ఆ భూములను ప్రభుత్వానికి అప్పగించాల్సివుంటుంది. లేకపోతే వారిపై కబ్జా కేసులు నమోదు చేస్తామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి ఇలాంటి ఓ డేరింగ్‌ జీవోను జారీ చేయడాన్ని అత్యధికులు హర్షిస్తుండగా, ప్రతిపక్షాలు, ముస్లింలు, దళితులు ఈ విషయానికి మతం రంగు పులుముతున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ