Advertisementt

క్వీన్ గా నటించేందుకు ఆమె ఓకే చెప్పింది!!

Fri 01st Jul 2016 02:49 PM
queen remake,kangana ranaut,trisha,tyagaraja,queen movie remake details  క్వీన్ గా నటించేందుకు ఆమె ఓకే చెప్పింది!!
క్వీన్ గా నటించేందుకు ఆమె ఓకే చెప్పింది!!
Advertisement
Ads by CJ

రెండేళ్లక్రితం బాలీవుడ్ లో సంచలనాత్మక విజయం సాధించిన క్వీన్ సినిమాని తెలుగులో రీమేక్ చెయ్యాలని అనుకున్నారు. కానీ ఏ హీరోయిన్ ఒప్పుకోక పోవడంతో అది కాస్తా వాయిదా పడింది. బాలీవుడ్ క్వీన్ లో కంగనా నటించింది. ఈ సినిమాలో నటనకు గాను ఆమె జాతీయ అవార్డు సైతం అందుకుంది. కానీ తెలుగులో అటువంటి పాత్రను చెయ్యడానికి మన హీరోయిన్స్ ఎవ్వరు ముందుకు రాలేదు. మొదట్లో సమంత ని అడగగా ఆమె చెయ్యనని చెప్పేసింది. తరవాత త్రిషని అడగగా ఆమె కూడా తిరస్కరించింది. ఇక నిత్యామీనన్ ఒప్పుకున్నట్లే అనిపించినా చివరి నిమిషం లో నో చెప్పేసింది. కానీ అప్పటినుండి హీరోయిన్ వేటలో వున్న నిర్మాత త్యాగరాజన్ మళ్ళీ త్రిషని అప్రోచ్ అయ్యాడట. త్రిష హీరోయిన్ గా వేషాలు తగ్గిపోయాయి. ఆమె ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో నటిస్తూ బండి లాగించేస్తుంది. ఆమె లేడీ ఓరియెంటెడ్ పాత్రలో చేసిన నాయకి విడుదలకు సిద్దమవుతుంది. అలాగే మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాను కూడా ఒప్పుకుందట. అటువంటి సమయం లో త్యాగరాజన్ త్రిషని క్వీన్ సినిమాలో నటించడానికి ఒప్పించాడని సమాచారం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ