కొరటాల దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నతాజా చిత్రం జనతా గ్యారేజ్. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యామీనన్ లు నటిస్తున్నారు. నిత్యామీనన్ ఈ చిత్రం లో రెండో హీరోయిన్ గా నటిస్తుంది. రెండో హీరోయిన్ అయినప్పటికీ ఆమె పాత్ర ఈ సినిమాకు చాలా కీలకం అంట. అయితే ఈ చిత్రంలో తన అనుభవాలను గుర్తు చేసుకుంటూ నిత్యామీనన్.. ఎన్టీఆర్ పై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మాములుగా నటులు కెమెరా ముందు నటిస్తారు కానీ.. ఎన్టీఆర్ మాత్రం తన పాత్రలో జీవిస్తాడు అని.. అతను ఒక నటుడు కాదు ఒక సైన్యం అంటూ ఆసక్తికరం గా మాట్లాడింది. అంతే కాకుండా నేను ఒక సీన్ లో సరిగ్గా చెయ్యలేక ఎన్నో టేక్స్ తీసుకున్నా. అన్ని టేక్స్ తీసుకున్నా నా పక్కన చేస్తున్న ఎన్టీఆర్ మాత్రం విసుగు చెందకుండా నాకు సహకరించాడని చెప్పుకొచ్చింది. అలాగే ఎన్టీఆర్ వ్యక్తిత్వం చూసి నేను ఆయన అభిమానినయ్యానని అంటుంది. అప్పుడెప్పుడో ప్రభాస్ ఎవరో తెలియదని పెద్ద కాంట్రవర్సీ క్రియేట్ చేసిన నిత్యామీనన్ తాజాగా ఇలా ఎన్టీఆర్ గురించి గొప్పగా చెప్పడం చూస్తుంటే..ఇప్పటికి గానీ నిత్యామీనన్ కి సినిమా సూత్రాలు తెలిశాయా అని అందరూ అనుకుంటున్నారు.