Advertisementt

పివి కి కేసీఆర్‌ అంత గౌరవం ఇస్తాడా..!?

Fri 01st Jul 2016 09:19 PM
pv narasimha rao,kcr,pv narasimha rao district,telangana,modi,sonia  పివి కి కేసీఆర్‌ అంత గౌరవం ఇస్తాడా..!?
పివి కి కేసీఆర్‌ అంత గౌరవం ఇస్తాడా..!?
Advertisement
Ads by CJ

ఒకవైపు కాంగ్రెస్‌ పార్టీకి మరలా పునరుజ్జీవం కలిగించి, నేటి నూతన భారత దేశా ఆర్ధిక విధానాలు, సంస్కరణలతో దేశానికి ఎంతో సేవ చేసిన దివంగత మాజీ ప్రధాని పి.వి.నరసింహారావును సోనియా, కాంగ్రెస్‌ పార్టీలు అవమాన పరిచాయని ఆయన కుటుంబ సభ్యులు చేస్తున్న విమర్శల మధ్య దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అదే సమయంలో పివికి భారతరత్న ఇవ్వాలని మోడీ ప్రభుత్వం కూడా భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే మా తెలంగాణ అంటూ ఎప్పుడు తన రాష్ట్రంపై ప్రేమతో, ప్రాంతీయ వాదంలో నాలుగు రెట్లు ముందుండే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణకే చెందిన మహా మనిషి పివి కావడంతో కొత్తగా ఏర్పాటు చేసే కొత్త జిల్లాలలో వరంగల్‌ లేదా కరీంనగర్‌ జిల్లాలో ఏర్పడే కొత్త జిల్లాలలోని ఓ జిల్లాకు పివి పేరు పెడతాడా? లేదా? అన్న చర్చ ముందుకు వస్తోంది. ఏకంగా దేశ ప్రధానిగానే దేశానికి ఎంతో సేవ చేసిన పివి పేరును ఓ కొత్త జిల్లాకు పెట్టాలని డిమాండ్‌ రోజురోజుకు పెరుగుతోంది. మరి ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిబద్దత ఏమిటో? ఈ విషయంలోనే తేలిపోతుందని తెలుగు ప్రజలు అభిప్రాయపడుతున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ