Advertisementt

నాని గాడు లోకల్..!

Sat 02nd Jul 2016 01:42 PM
nani,nenu local,majnu,nani movies,hero nani new movie title,keerthi suresh  నాని గాడు లోకల్..!
నాని గాడు లోకల్..!
Advertisement
Ads by CJ

నాని కెరీర్ లో మాస్ కథలతో తెరకెక్కిన సినిమాలన్నీ ఘోర పరాజయాన్ని మూట కట్టుకున్నాయి. అయితే తరవాత వచ్చిన 'ఎవడే సుబ్రమణ్యం' పర్వాలేదనిపించినా దాని తరవాత వచ్చిన 'భలే భలే మగాడివోయ్' హిట్ తో నాని ఓవర్ నైట్ లో స్టార్ గా ఎదిగిపోయాడు. తాజాగా వచ్చిన 'జెంటిల్మన్' సూపర్ హిట్ టాక్  తెచ్చుకుని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. వెరైటీ  కథలతో వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని ఇప్పుడు 2 సినిమాలు తో బిజీ గా వున్నాడు. ఒక సినిమా విరంచి వర్మ డైరెక్షన్ లో 'మజ్ను' అనే సినిమా చేస్తున్నాడు. ఇక రెండో సినిమాని  'సినిమా చూపిస్తా మావ' ఫేమ్ త్రినాథ రావు డైరెక్షన్ లో చేస్తున్నాడు. ఈ సినిమాకి 'నేను లోకల్' అనే టైటిల్ ఫిక్స్ చేశారని సమాచారం. ఈ సినిమా మాస్ జోనర్ లో ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో నాని కి జోడి గా కీర్తి సురేష్ ని ఎంపిక చేశారట. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ