పాత చిత్రాలలోని పాటలను ఎప్పుడు తట్టిలేపినా మధురానుభూతుల్లో మునిగితేలుతాం. అందుకే ఈ తరం హీరోలు పాత చిత్రాలలోని పాటలను రీమిక్స్ చేయడానికి ఉత్సాహం చూపిస్తుంటారు. రామ్‌చరణ్, సాయిధరమ్‌తేజ్‌లు తమ చిత్రాలలో మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రాలలోని సూపర్‌హిట్ సాంగ్స్‌ను రీమిక్స్ చేసి మెప్పించారు. అయితే ఇలా రీమిక్స్‌లో చేసిన కొన్ని పాటలు వివాదాస్పదమైనాయి కూడా. విక్రమ్ నటించిన 'మల్లన్న' చిత్రంలో 'దసరాబుల్లోడు' సినిమాలోని 'పచ్చగడ్డి కోసేటి పడుచుపిల్ల...'ను రీమిక్స్ చేయడంపై అప్పుడు తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ నటిస్తున్న 'ఆటాడుకుందాం..రా' చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు నటించిన సూపర్‌హిట్ క్లాసిక్ చిత్రం 'దేవదాసు' చిత్రంలోని ఎవర్‌గ్రీన్ సాంగ్ 'పల్లెకు పోదాం... పారును చూద్దాం.. ఛలో..ఛలో...'అనే పాటను రీమిక్స్ చేస్తున్నారు. ఈ పాట షూటింగ్‌తో ఈ చిత్రం పూర్తి కానుంది. మరి ఈ రీమిక్స్‌ను మన సుశాంత్ చెడగొడతాడో.... అదరగొడుతాడో వేచిచూడాల్సివుంది...!