Advertisementt

మంత్రి నారాయణ సరిగ్గా పని చేశాడు!

Tue 05th Jul 2016 02:14 PM
ap minister narayana,sachivalayam,chandrababu naidu,serve rating,tdp minister narayana  మంత్రి నారాయణ సరిగ్గా పని చేశాడు!
మంత్రి నారాయణ సరిగ్గా పని చేశాడు!
Advertisement
Ads by CJ

ఏపీ రాజధాని అమరావతిలోని వెలగపూడిలో అనుకున్న సమయంలో నిర్మాణాలు పూర్తి చేసిన ఘనత మంత్రి నారాయణకే దక్కుతుంది. అసలు ఈ నిర్మాణాలు అనుకున్న సమయానికి పూర్తి అవుతాయా? లేదా? అనే సందిగ్దంలో అందరూ తమ అనుమానాలను వ్యక్తం చేశారు. కానీ చంద్రబాబు మాత్రం నారాయణకు పూర్తి అధికారాలు ఇచ్చి అనుకున్న సమయానికి తాత్కాలిక సచివాలయం పూర్తి చేయడంలో విజయం సాధించాడు. మున్సిపల్‌ శాఖామంత్రిగా ఉన్న నారాయణ తన మంత్రిత్వ శాఖకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో పలు విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఆయన పనితీరుపై గతంలో సర్వేలో జీరో కేటగిరికి చేరాడు. అయినా తన మంత్రిత్వశాఖలపై నిర్ణయాలు తీసుకోలేని నారాయణ తాత్కాలిక సచివాలయం నిర్మాణంలో మాత్రం పూర్తిగా క్రెడిట్‌ కొట్టేసి అనుకున్న పనిని విజయవంతం చేయడంలో ముఖ్యభూమిక పోషించాడని ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ