Advertisementt

ఆలీ కి సీనియర్ నటి క్లాస్..!

Wed 06th Jul 2016 05:37 PM
actor ali,siima 2016 awards,suhasini,suhasini class to ali  ఆలీ కి సీనియర్ నటి క్లాస్..!
ఆలీ కి సీనియర్ నటి క్లాస్..!
Advertisement
Ads by CJ

హాస్యనటుడు అలీకి నోటి దురద బాగా ఎక్కువైంది. ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు ఆయన నోటి నుంచి అనేక సార్లు మాట్లాడిన వెకిలిమాటలు ఆయనకు చాలా తలనొప్పులు తెచ్చిపెట్టాయి. కొన్ని ఫంక్షన్ లలో ఆలీ హోస్ట్ గా వ్యవహరించాడు. అయితే తాను యాంకరింగ్ చేస్తున్నప్పుడు గాని స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు గాని హీరోయిన్స్, యాంకర్లను ఉద్దేశించి చేసిన వెకిలి కామెంట్లు.. చాలా మందికి కోపాన్ని తెప్పించాయి. పలువురు మహిళలు, యువతులు అలీ కామెంట్లకు వీడియోల రూపంలో సోషల్ మీడియాలో తమ నిరసన వెలిబుచ్చారు. ఆయనకు బుద్ది చెప్పాలంటూ  పెద్ద దుమారాన్నే రేపారు. ఇక తర్వాత ఆలీ ఏ ఫంక్షన్ లో గానీ, ఆడియోలో గానీ మాట్లాడకుండా సైలెంట్ అయ్యాడు. అయితే ఆలీ అదే తప్పు మళ్ళీ చేసాడు. తాజాగా సింగపూర్ లో జరిగిన సైమా అవార్డ్స్ వేడుకలో అలీ చేసిన కామెంట్లకు సీనియర్ నటి సుహాసిని అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. అయితే ఆమె అలీని ఉద్దేశించి ఆడవాళ్లను, చిన్నపిల్లలను అవమానించేలా.. ఎప్పుడు జోక్స్ గాని, కామెంట్స్ కానీ చెయ్యవద్దని ఇండైరెక్ట్ గా చెప్పారట. మరి ఇకనైనా ఆలీ..నోరు అదుపులో పెట్టుకుంటాడో లేక ఇలాగే మరి కొందరితో క్లాస్ పీకించుకుంటాడో..చూద్దాం.    

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ