Advertisementt

జంటిల్మన్ భామ మరో మూవీ స్టేటస్!

Thu 07th Jul 2016 12:45 PM
nivetha thomas,gentleman,anurag productions,ajay voddirala director,kothapalli raghubabu,kb chowdary,naveen chandra  జంటిల్మన్ భామ మరో మూవీ స్టేటస్!
జంటిల్మన్ భామ మరో మూవీ స్టేటస్!
Advertisement
Ads by CJ

నవీన్ చంద్ర, నివేద థామస్ హీరో, హీరోయిన్‌గా అనురాగ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుకుమార్ శిష్యుడు అజయ్ వొద్దిరాల దర్శకుడుగా ,కె రఘుబాబు,కె బి చౌదరి నిర్మాతలుగా నిర్మిస్తున్న లవ్,యాక్టన్,ఫ్యామిలీ ఎంటర్‌టైన్ చిత్రం రెండో షెడ్యూల్ పూర్తి అయింది. ఈ సందర్బంగా నిర్మాతలు మాట్లాడుతూ దీంతో మేజర్ పార్ట్ చిత్రీకరణ పూర్తి అయింది. జులై రెండో వారం నుండి జరిగే మూడవ షెడ్యూల్ తో చిత్రీకరణ మొత్తం పూర్తి అవుతుంది. ఆగస్ట్‌లో విదేశాలలో పాటలను షూట్ చేసి, అదే నెల చివర వారంలో ఆడియోను, సెప్టెంబర్‌లో చిత్రాన్ని రిలీజ్ చేస్తాం. హీరో నవీన్ చంద్ర కెరీర్‌ను మలుపు తిప్పే చిత్రమవుతుంది. హీరోయిన్ నివేద థామన్ 'జంటిల్మన్' లో లా మరోసారి అభినయానికి ఎంతో అవకాశం ఉన్న పాత్రను ఇందులో పోషిస్తుంది. ఆలీ కామెడి ఈ చిత్రంలో హైలెట్‌గా నిలుస్తుంది. త్వరలో ఈ చిత్రం టైటిల్‌ను ప్రకటిస్తాం అన్నారు. ఈ చిత్రంలో అలీ,దేవన్, సుప్రీత్, రోహిణి, జీవా, తాగుబోతు రమేష్, మురళి శర్మ, నిళల్‌గల్ రవి తదితరులు . ఈ చిత్రానికి మాటలు కె వేణుగోపాల్ రెడ్డి, శ్రీనాథ్ బాదినేని, సంగీతం రతీష్ వేగా, సాహిత్యం అనంతశ్రీరామ్, రామజోగయ్య శాస్త్రీ, కరుణాకరణ్, సర్వా, ఛాయాగ్రహణం గిరీష్ గంగాధరన్, కళ రాజీవ్ నాయర్ , కూర్పు ఎస్ బి ఉద్దవ్, నిర్మాణ నిర్వహణ రవితేజ పూదరి, నిర్మాతలు కొత్తపల్లి రఘుబాబు, కె బి చౌదరి ,దర్శకత్వం అజయ్ వొద్దిరాల.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ