Advertisementt

పరిణీతి చోప్రా ని పక్కన పెట్టేశారు..!

Fri 08th Jul 2016 07:31 PM
parineeti chopra,mahesh babu,rakul preet singh,ar murugadoss,rakul preet in mahesh movie  పరిణీతి చోప్రా ని పక్కన పెట్టేశారు..!
పరిణీతి చోప్రా ని పక్కన పెట్టేశారు..!
Advertisement
Ads by CJ

మహేష్ బాబు - మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో హీరోయిన్ గా పరిణీతి చోప్రా ని తీసుకున్నారు అని అంత అనుకున్నారు. కానీ ఈ సినిమా యూనిట్ మాత్రం ఈ విషయాన్ని ఎక్కడా ఆఫీషియల్ గా ఎనౌన్స్ చేయలేదు. అయితే పరిణీతి ని ఈ సినిమాలో తీసుకుంటే ఆమెను తెలుగు ప్రేక్షకులు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారో అని చిత్ర యూనిట్ భావిస్తుందని.. అదీకాక ఆమె అడిగే రెమ్యూనరేషన్ కూడా హై రేంజ్ లో ఉందని...అందుకే చిత్ర యూనిట్ మరో హీరోయిన్ ని సెలెక్ట్ చేసే పనిలో పడ్డారని వినికిడి. అయితే తెలుగులో తమన్నా, కాజల్ వంటి వారిని పక్కన పెట్టించేసి.. తనదైన అవకాశాలు చేజిక్కించుకుంటూ దూసుకు పోతున్న రకుల్ ప్రీత్ సింగ్ ని తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. మరి మహేష్ తో ఎప్పటినుండో నటించాలని ఎదురు చూస్తున్న రకుల్ కి ఈ వార్త అమృతం పోసినట్టు అనిపిస్తుందేమో. అదే నిజమైతే రకుల్ కి గోల్డెన్ ఛాన్స్ తగిలినట్టే. ఇప్పటికే టాలీవుడ్ యంగ్ హీరోలందరితో నటించిన రకుల్.. మహేష్ తో కూడా జోడి కడితే ఇక ఆమెకు ఇండస్ట్రీలో తిరుగుండదని చెప్పుకుంటున్నారు సినీ ప్రేమికులు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ