Advertisementt

గెస్ట్ గా కనిపించేందుకు ఇష్టపడుతున్నారు!

Sat 09th Jul 2016 02:47 PM
guest roles,star heroes,nagarjuna,nirmala convent,venkatesh,premam,chiranjeevi,ram charan,allu arjun,sirish  గెస్ట్ గా కనిపించేందుకు ఇష్టపడుతున్నారు!
గెస్ట్ గా కనిపించేందుకు ఇష్టపడుతున్నారు!
Advertisement
Ads by CJ

గతంలో పలు చిత్రాలలో సీనియర్‌స్టార్స్‌ అయిన మెగాస్టార్‌ చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్‌లు అతిథులుగా కనిపించారు. ఈ మధ్యకాలంలో చిరంజీవి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి బిజీ అయినప్పటికీ తన తనయుడు రామ్‌చరణ్‌ నటించిన 'మగధీర, బ్రూస్‌లీ' చిత్రాల్లో అతిథి పాత్రల్లో తళుక్కుమన్నాడు. ఇక స్టైలిష్‌ స్టార్‌ అల్లుఅర్జున్‌ సైతం 'ఎవడు, రుద్రమదేవి' వంటి చిత్రాల్లో కీలకపాత్రలను పోషించాడు. కాగా ఇప్పుడు సీనియర్‌స్టార్స్‌తో పాటు యంగ్‌ స్టార్స్‌ కూడా కొన్ని కొత్త చిత్రాల్లో అతిధులుగా కనిపించేందుకు సిద్దం అవుతున్నారు. నాగార్జున విషయానికి వస్తే ఆయన హీరో శ్రీకాంత్‌ తనయుడు హీరోగా ఎంట్రీ ఇస్తోన్న 'నిర్మలాకాన్వెంట్‌' చిత్రాన్ని స్వయంగా నిర్మించడమే కాకుండా ఓ కీలకపాత్రను చేస్తున్నాడు. ఇక వెంకటేష్‌.. నాగచైతన్య హీరోగా నటిస్తోన్న 'ప్రేమమ్‌' రీమేక్‌లో ఓ కామియో పాత్రలో కనిపించనున్నాడు. ఇక తన తండ్రి చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రంలో రామ్‌చరణ్‌ నిర్మాతగానే కాదు.. ఓ పాత్రలో మెరవనున్నాడు. అలాగే అల్లుఅర్జున్‌ తాజాగా మరో చిత్రంలో కీలకపాత్రను చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. తన తమ్ముడు అల్లుశిరీష్‌ హీరోగా మల్లిడి వేణు దర్శకత్వంలో రూపొందే చిత్రంలో బన్నీ ఓ కీలకపాత్రను చేయనున్నాడని సమాచారం. మల్లిడి వేణు తండ్రితో బన్నీకి మంచి పరిచయం ఉండటం, ఆయన నిర్మాతగా 'బన్ని' చిత్రం చేసిన సంగతి తెలిసిందే. ఇక తన తమ్ముడు చిత్రానికి స్టార్‌ ఇమేజ్‌ లుక్‌ తీసుకురావడంలో కూడా బన్నీ పాత్ర ఈ చిత్రంలో కీలకం కానుంది. ఇంకో విశేషం ఏమిటంటే ఈ చిత్రం 700 సంవత్సరాల కిందట జరిగిన కథగా రూపొందనుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ