'జబర్దస్త్' కామెడీ షో తో ఫేమస్ అయిన యాంకర్లు అనసూయ, రష్మీ. కాగా 'సోగ్గాడే చిన్నినాయనా, క్షణం' చిత్రాలతో అనసూయ బాగానే అందరిని ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ భామ సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్స్ కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల ఆమె ఓ ఫొటోషూట్‌లో పాల్గొంది. ఇప్పుడు అందులోని ఓ ఫొటో బయటకు లీక్ అయింది. సెక్సీ లుక్‌తో ఉన్న అనసూయ ఫొటోలు చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు. ఒకే ఒక్క ఫొటోనే ఇలా ఉంటే పూర్తి ఫొటోలు బయటకు వస్తే అవి ఏ రేంజ్లో మంటపుట్టిస్తాయో అని శృంగార ప్రియులు ఆరాటపడుతున్నారు.
ఇక 'జబర్దస్త్' ద్వారానే పాపులర్ అయిన మరో యాంకర్ రష్మీ. ఆ మధ్య ఆమె నటించిన 'గుంటూరు టాకీస్' చిత్రంలో ఆమె అందాల ప్రదర్శన చేసింది. ఈ చిత్రం మంచి కలెక్షన్లు రాబట్టిదంటే అది రష్మీ మాయే అని చెప్పవచ్చు. తాజాగా ఆమె నటించిన 'అంతం' చిత్రం రిలీజ్ అయింది. ఈ చిత్రంలో ఆమె కనిపించేది కేవలం 15 నిమిషాలే అయినా ఆమె అందాల ప్రదర్శనను చూపిస్తూ చేసిన పబ్లిసిటీని చూసి ఈ చిత్రం చూడాలని థియేటర్‌కు వెళ్లిన శృంగార ప్రియులు నిరాశపడుతున్నారు. కాగా చిత్రానికి అన్ని బాధ్యతలు నిర్వహించిన కళ్యాణ్‌పై రష్మీ కూడా మండిపడుతోంది. తనకు ఒకటి చెప్పి మరోటి తీశారని, తన పాత్రకు ప్రాదాన్యం లేకుండా చేశారని, అసలు కంటెంట్‌ను పక్కనపెట్టి తన మోసం చేశారంటూ ఈ భామ మండిపడటమే కాదు...ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలకు కూడా హాజరుకావడం లేదు.
సో ఇలా ఉంది..ఈ యాంకర్ల ప్రస్తుత పరిస్థితి.