Advertisementt

నెంబర్‌వన్‌ స్దానంపై కన్నేసింది...!

Mon 11th Jul 2016 06:38 PM
anushka sarma,sultan movie,bollywood top heroine,deepika,priyanka,hollywood,katrina,kareena kapoor  నెంబర్‌వన్‌ స్దానంపై కన్నేసింది...!
నెంబర్‌వన్‌ స్దానంపై కన్నేసింది...!
Advertisement
Ads by CJ

తాజాగా రంజాన్‌ కానుకగా సల్మాన్‌ఖాన్‌ హీరోగా రూపొందిన 'సుల్తాన్‌' చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకున్న హీరోయిన్‌ అనుష్కశర్మ. అయితే ఇప్పటివరకు బాలీవుడ్‌లో టాప్‌లో ఉన్న దీపికా పడుకొనే, ప్రియాంకాచోప్రాలు ఇప్పుడు హాలీవుడ్‌పై దృష్టిపెట్టారు. ఇక కత్రినా, కరీనాలు రిటైర్‌మెంట్‌కు దగ్గరయ్యారు. దీంతో ఇప్పుడు బాలీవుడ్‌లో టాప్‌హీరోయిన్‌ ఎవరు? అనే చర్చ జరుగుతోంది. ముగ్గురు ఖాన్స్‌తో కలిసి నటించి తన ఖాతాలో భారీహిట్లను సొంతం చేసుకున్న అనుష్కశర్మ మాత్రం ఇప్పటివరకు టాప్‌హీరోయిన్‌ అనిపించుకోలేకపోయింది. కానీ 'సుల్తాన్‌'తో మాత్రం ఆమెకు త్వరలో స్టార్‌హీరోయిన్‌ హోదా రావడం ఖాయమని బాలీవుడ్‌ సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. మొత్తానికి అందంతో పాటు ఆమెలో అభినయ సామర్ధ్యం కూడా ఉండటంతో ఇప్పుడు ఆమె టాక్‌ ఆఫ్‌ ది బాలీవుడ్‌గా మారింది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ