మన సీనియర్ స్టార్స్ అయిన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌ల చిత్రాలకు హీరోయిన్ల సమస్య తీవ్రంగా ఉంది. షూటింగ్ ప్రారంభమైన తర్వాత కూడా హీరోయిన్లు దొరకడం లేదు. బాలయ్య నటిస్తోన్న వందో చిత్రం 'గౌతమీ పుత్ర శాతకర్ణి' చిత్రం మొదటి రెండు షెడ్యూల్స్ వరకు హీరోయిన్లు ఫైనల్ కాలేదు. చివరికి ఆపసోపాలు పడి శ్రియను ఎంచుకున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 150వ చిత్రానికి కూడా అదే సమస్య ఎదురవుతోంది. ఇక నాగార్జున పక్కన లావణ్య త్రిపాఠి వంటి యంగ్ హీరోయిన్లు నటిస్తున్నా వారు స్టార్ హీరోయిన్లు మాత్రం కాదు. ఇక వెంకీ అయితే నయనతార, అంజలి వంటి వారితో అడ్జెస్ట్ అవుతున్నాడు. అదే సమయంలో బాలీవుడ్‌లో సీనియర్ స్టార్స్ అయిన సల్మాన్‌ఖాన్, షారుఖ్‌ఖాన్, అమీర్‌ఖాన్ వంటి 50 ప్లస్ హీరోల సరసన మాత్రం స్టార్‌హీరోయిన్లు, కొత్తవారు ఇలా అందరూ నటించడానికి ఎగబడుతున్నారు. మరి మన స్టార్స్‌కు లేనిది ఏమిటి? బాలీవుడ్ స్టార్స్‌కు ఉన్నది ఏమిటి? అనే అంశం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది.