Advertisementt

రాజమౌళి తండ్రి కోసమేనా 'రాధ ప్రేమకథ'?

Mon 11th Jul 2016 11:37 PM
ss rajamouli,v vijayendra prasad,radha premakatha,uv creations,siddha,bhagamati  రాజమౌళి తండ్రి కోసమేనా 'రాధ ప్రేమకథ'?
రాజమౌళి తండ్రి కోసమేనా 'రాధ ప్రేమకథ'?
Advertisement
Ads by CJ

యూవీ క్రియేషన్స్ సంస్థ తాజాగా రెండు టైటిల్స్ ను రిజిష్టర్ చేయించారు. అందులో ఒకటి 'సిద్ద' కాగా మరొకటి  'రాధ ప్రేమకథ'. 'బాహుబలి2' తర్వాత ప్రభాస్ యూవీ క్రియేషన్స్ బ్యానర్లో సుజిత్ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్న విషయం తెలిసిందే. మరి ఈ మూవీ కోసం 'సిద్ధ' అనుకున్నా.. మరి రెండో టైటిల్ 'రాధ ప్రేమకథ' ఎవరికోసం? ప్రస్తుతం అనుష్క యూవీ క్రియేషన్స్ లో ఓ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. 'భాగమతి' అనే టైటిల్ అనుకుంటున్న ఈ మూవీకి టైటిల్ మార్చి 'రాధ ప్రేమకథ' గా పెట్టనున్నారా! దీని వెనుక రాజమౌళి తండ్రిగారైన విజయేంద్రప్రసాద్ వుండి ఉంటాడా! అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. కారణం.. విజయేంద్రప్రసాద్ ఎప్పటినుండో 'భాగమతి' అనే టైటిల్ తో స్వయంగా తానే ఓ చిత్రాన్ని తెరకెక్కించాలని చూస్తున్న విషయం తెలిసిందే. అందుకోసం కథ కూడా రెడీ చేసుకుని ఉన్నానని పలు ఇంటర్వ్యూలలో చెప్పాడు కూడా. సో.... బాహుబలి షూటింగ్ టైమ్ లో ప్రభాస్ తో ఈ విషయం చెప్పడంతో.. తన సొంత బ్యానర్ అయిన యూవీ క్రియేషన్స్ లో 'భాగమతి'ని 'రాధ ప్రేమకథ' తో రిప్లేస్ చేయించాడని అనుకుంటున్నారు. ఏ విషయం యూనిట్ నుండి అఫీషియల్ గా తెలియాల్సి వుంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ