Advertisementt

మహేష్ ఆ సినిమా చెయ్యట్లేదు...!

Tue 12th Jul 2016 08:20 PM
mahesh babu,brahmotsavam flop,director sundar c,300 crores budget movie,vijay,3 versitions,murugadoss movie  మహేష్ ఆ సినిమా చెయ్యట్లేదు...!
మహేష్ ఆ సినిమా చెయ్యట్లేదు...!
Advertisement
Ads by CJ

300 కోట్లతో 3  భాషలలో ప్రముఖ దర్శకుడు సుందర్ .సి భారీ బడ్జెట్ తో ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం లో తెలుగు వెర్షన్ లో సూపర్ స్టార్ మహేష్ నటిస్తాడని.. అలాగే తమిళ వెర్షన్ లో ఇళయ దళపతి విజయ్ నటిస్తాడనే వార్త ప్రచారం లోకి వచ్చింది. ఈ సినిమా  చారిత్రక నేపధ్యం లో ఉంటుందని చెప్పారు. అయితే ఈ సినిమాలో నటించేందుకు అటు మహేష్ తోనూ ఇటు విజయ్ తోనూ చర్చలు జరిపారని, వారు ఒప్పుకున్నారనే వార్త కూడా బయటికి వచ్చింది. అయితే మహేష్ ఆ సినిమాలో నటించనని చెప్పినట్లు కోలీవుడ్ మీడియా ప్రచారం చేస్తోంది. దీనికి కారణం 'బ్రహ్మోత్సవం' ప్లాప్ తర్వాత ఆయన తన సినిమాల పట్ల చాలా కేర్ తీసుకుంటున్నాడని, అంతేకాకుండా ప్రస్తుతం నటిస్తున్న మురుగదాస్ సినిమా కోసం ఎక్కువగా కేర్ తీసుకోవడం వల్ల మరో ప్రాజెక్టు లో నటించలేనని చెప్పినట్లు సమాచారం. మహేష్ ఇప్పటివరకు తెలుగు దర్శకులతోనే సినిమాలు ఎక్కువగా చేసుకుంటూ వస్తున్నాడు. అంతకుముందు మణిరత్నం కూడా మహేష్ తో సినిమా చేయాలని చూసాడు కానీ అది ఎందుకో వర్కౌట్ అవ్వలేదు. అయితే తెలుగు లో మహేష్ నటించడం లేదు కాబట్టి.. ఇంకే స్టార్ హీరో ని ఈ సినిమాకోసం సుందర్ సి ఒప్పిస్తాడో చూద్దాం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ