Advertisementt

ఇలా అయితే 'ధ్రువ' దసరా కి కష్టమే!

Wed 13th Jul 2016 11:02 AM
ram charan dhruva,dhruva movie,misunderstandings between charan and surendar reddy,thanioruvan,dhruva movie shooting details  ఇలా అయితే 'ధ్రువ' దసరా కి కష్టమే!
ఇలా అయితే 'ధ్రువ' దసరా కి కష్టమే!
Advertisement
Ads by CJ

ఈ మధ్య కాలం లో సరైన విజయాలు లేక రేస్ లో వెనకబడిపోయిన రామ చరణ్.. ఈ సారి ఎలాగైనా హిట్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి తెగ ట్రై చేస్తున్నాడు. తాజాగా ఆయన సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'ధ్రువ' చిత్రం లో నటిస్తున్నాడు. ఈ చిత్రం దసరా కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం రామ్ చరణ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని టాక్. 'ధ్రువ' ని తమిళ సినిమా 'తని ఒరువన్' కి రీమేక్ అనే విషయం తెలిసిందే. అయితే తమిళ వెర్షన్ కి కొన్ని మార్పులు చేర్పులు  చేసి తెలుగులో 'ధ్రువ' కథను సిద్ధం చెయ్యడానికి డైరెక్టర్ సురేందర్ రెడ్డి చాలా టైం తీసుకున్నాడట. అందుకే 'ధ్రువ' సినిమా షూటింగ్ లేటైందని టాక్. ఇప్పటికి కూడా ఈ చిత్రం షూటింగ్ కొంచెం స్లో గానే ఉందంట. అంతే కాకుండా ఈ సినిమాకి సంబంధించి ఇంకో న్యూస్ ప్రచారంలోకి వచ్చింది. పాటల ప్లేస్ మెంట్స్ విషయం లో సురేందర్ రెడ్డికి, రామ చరణ్ కి మధ్య తేడా వచ్చిందని సమాచారం. తమిళ్ వెర్షన్ 'తని ఒరువన్' లో పాటలకు పెద్ద ఇంపార్టెంట్ లేదు. అలాగే కొంచెం కూడా మసాలా వంటి అంశాలు లేవని... అందుకే ఈ అంశాలన్నీ'ధ్రువ' తెలుగు రీమేక్ లో చేర్చాలని చరణ్ పట్టుపడుతున్నాడని టాక్. అయితే ఇలా చేస్తే అది ప్రేక్షకులకు పెద్దగా నచ్చదని డైరెక్టర్ సురేందర్ రెడ్డి చెప్పాడని సమాచారం. అందుకే వీరిద్దరికి పడడం లేదని చిత్ర యూనిట్ చెబుతోంది. దాని వల్ల సినిమా షూటింగ్ లేట్ అవుతుందని అంటున్నారు. మరి ఈ సినిమా షూటింగ్ ఎప్పటికి కంప్లీట్ చేసి దసరాకి విడుదల చేస్తారో చూడాలి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ