Advertisementt

మళ్ళీ నారా రోహిత్‌తో అంటే తప్పు చేసినట్లే!

Wed 13th Jul 2016 11:17 AM
nara rohit,parasuram,solo movie,srirasthu subhamasthu,again nara rohit and parasuram combo  మళ్ళీ నారా రోహిత్‌తో అంటే తప్పు చేసినట్లే!
మళ్ళీ నారా రోహిత్‌తో అంటే తప్పు చేసినట్లే!
Advertisement
Ads by CJ

బాణం సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన నారా రోహిత్ తొలిచిత్రంతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్నా..ఇప్పటి వరకు అతని కెరీర్‌లో చెప్పుకోదగ్గ కమర్షియల్ హిట్ లేదు. ఇప్పటి వరకు అరడజనుకు పైగా సినిమాలు చేసినా.. అతని కెరీర్‌లో అంతో ఇంతో చెప్పుకోదగ్గ చిత్రం పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సోలో'. పూర్తి కుటుంబ కథా చిత్రంగా రూపొందిన ఈ చిత్రం కంటెంట్ పరంగా స్ట్రాంగ్‌గా వున్న...ఆ చిత్ర కమర్షియల్ విజయానికి రోహిత్ మైనస్ అయ్యాడని ఆ సినిమా విడుదల తర్వాత కామెంట్స్ వినిపించాయి. అలాంటి స్ట్రాంగ్ కంటెంట్ చిత్రానికి అల్లు అర్జున్, ఎన్టీఆర్ లాంటి స్టార్‌హీరోలతో తీస్తే.. ఆ చిత్రం రేంజ్ మరోలా వుండేదని..దర్శకుడు పరశురామ్‌తో పాటు సినీజనాలు కూడా అనుకున్నారు. అయితే తాజాగా పరశురామ్ మళ్లీ నారా రోహిత్‌తో ఓ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అల్లు శీరిష్‌తో 'శ్రీరస్తు శుభమస్తు' చిత్రాన్ని రూపొందించిన పరశురామ్ తన తదుపరి చిత్రం రోహిత్‌తో చేస్తున్నాడని అంటున్నారు. అయితే కాస్త ఆలస్యమైనా గీతా ఆర్ట్స్ కాంపౌండ్‌లోనే వుండి ఈ సారి అల్లు అర్జున్‌తో సినిమా చేయమని..పరశురామ్ సన్నిహితులు సలహాలు ఇస్తున్నారట..! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ