Advertisementt

ఈ సినిమాల సందడి వారమేనా?

Wed 13th Jul 2016 06:24 PM
allari naresh,selfie raja,nayaki,kabali,producers  ఈ సినిమాల సందడి వారమేనా?
ఈ సినిమాల సందడి వారమేనా?
Advertisement
Ads by CJ

శుక్రవారం (15వ తేదీ) 'సెల్ఫీ రాజా', 'నాయకి' సినిమాలు రిలీజ్‌ అవుతున్నాయి. వీటికి థియేటర్లు ఎలాంటి ప్రాబ్లమ్‌ లేకుండా కన్‌ఫర్మ్‌ అయ్యాయి. అయితే వీటి సందడి కేవలం వారమే అనే టాక్‌ ట్రేడ్‌లో వినిపిస్తోంది. ఎందుకంటే జూలై 22న 'కబాలి' రిలీజ్‌ అవుతుందని నిర్మాత ప్రకటించారు. సెన్సార్‌ కూడా పూర్తి చేశారు. రజనీకాంత్‌కు తెలుగునాట మన స్టార్‌ హీరోలకు ఉన్నంత పాపులారిటీ ఉన్న విషయం తెలిసిందే. దాంతో 'కబాలి' కోసం ఎక్కువ థియేటర్లు బ్లాక్‌ చేస్తారు. ఓపనింగ్స్‌ రాబట్టడానికి ప్రయత్నిస్తారు. దాంతో కబాలి కోసం తెలుగు సినిమాలు ప్రదర్శించే థియేటర్లను ఖాళీ చేయించే ప్రమాదం ఉందని సదరు చిత్ర నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు. 'సెల్ఫీ రాజా', 'నాయకి' చిత్రాలకు అద్భుతమైన టాక్‌ వస్తే సరే లేదంటే షిప్టింగ్‌ తప్పదు. 

ఇప్పటికే రన్నింగ్‌లో ఉన్న 'అర్ధనారి', 'రోజులుమారాయి', 'జెంటిల్‌మన్‌' చిత్రాలకు సైతం ప్రమాదం పొంచిఉంది. 

రెండు రాష్ట్రాల బయ్యర్లు తెలుగు సినిమాలపై కనికరం చూపిస్తారా లేక కలక్షన్ల కోసం 'కబాలి'కి కొమ్ముకాస్తారా అనేది చూడాలి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ