సూపర్ స్టార్ రజనీకాంత్ మానియా మెుదలైంది. 'కబాలి' రిలీజ్ తేదీ ప్రకటించడంతో అభిమానుల హడావుడి పెరిగింది. చంద్రముఖి తర్వాత సరైన హిట్స్ లేని రజనీకి 'కబాలి' మంచి ఊపునిస్తుందని భావిస్తున్నారు. బాషా తర్వాత కబాలిలో రజని గెటప్ ఫ్యాన్స్ ని పిచ్చెక్కిస్తోంది.
'కబాలి' సినిమాకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పటికే 200 కోట్ల వ్యాపారం జరిగింది. సుమారు 3000 వేల థియటర్లలో సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 'కబాలి' కోసం చేసిన ప్రచారం హైప్ ని మరింత పెంచింది. దాంతో జాతీయ మీడియా సైతం ఈ సినిమావైపు దృష్టిసారించింది.
తమిళనాడులో ముఖ్యంగా చెన్నైలో 'కబాలి' విడుదల రోజున ఉండే హంగామాను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు టీవీ ఛానల్స్ ప్రయత్నిస్తున్నాయి. ఆరు పదుల వయస్సు దాటినా, ఎందరో కుర్ర హీరోలు ఉన్నాసరే రజనీ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని 'కబాలి' క్రేజ్ నిరూపిస్తోంది.