Advertisementt

అన్న కోసం ఎన్టీఆర్‌ ఎంతగా మారాడో!

Thu 14th Jul 2016 11:05 AM
ntr,kalyan ram,vakkantham vamsi,janatha garage,ntr no remuneration for kalyan ram  అన్న కోసం ఎన్టీఆర్‌ ఎంతగా మారాడో!
అన్న కోసం ఎన్టీఆర్‌ ఎంతగా మారాడో!
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌ టాప్‌ స్టార్స్‌లో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఒకడు. ఎన్టీఆర్‌కు మాస్‌లో ఉన్న ఇమేజ్‌ అందరికీ తెలిసిందే. దాంతో ఆయన చిత్రాలకు భారీ ఓపెనింగ్స్‌ వస్తాయి. సినిమా ఫ్లాపయినా సరే వసూళ్లు సాధించే సత్తా ఉన్న స్టార్‌ కావడంతో ఎన్టీఆర్‌తో చిత్రాలు చేయడానికి దర్శకనిర్మాతలు క్యూలో ఉంటారు. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్‌..కొరటాల శివ దర్శకత్వంలో 'జనతాగ్యారేజ్‌' చిత్రం చేస్తున్నాడు. ఈచిత్రం ఆగష్టు 12న విడుదలకానుంది. ఆ తర్వాత తన అన్నయ్య నందమూరి కళ్యాణ్‌రామ్‌ నిర్మాతగా ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బేనర్‌లో రచయిత వక్కంతం వంశీని దర్శకునిగా పరిచయం చేస్తూ ఎన్టీఆర్‌ ఓ చిత్రం చేయనున్నాడు. వాస్తవానికి ఎన్టీఆర్‌ తన రెమ్యూనరేషన్‌ విషయంలో చాలా కఠినంగా ఉంటాడు. పదిపైసలు తేడా వచ్చినా ఒప్పుకోడు. కానీ అది బయట నిర్మాతల దగ్గరే. అయితే ఇక్కడ కళ్యాణ్‌రామ్‌ సినిమాను గురించి చెప్పాలి. తన అన్నయ్య చిత్రం కోసం ఎన్టీఆర్‌ పదిపైసలు కూడా తీసుకోకుండా నటించడానికి ఒప్పుకున్నాడని తెలుస్తోంది. 'కిక్‌2' చిత్రంతో భారీ నష్టాలు చవిచూసిన కళ్యాణ్‌రామ్‌ కోసం ఈ  చిత్రాన్ని ఎన్టీఆర్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ముందుగా అడ్వాన్స్‌లు, రెమ్యూనరేషన్‌లు తీసుకోకుండా సినిమా విడుదలైన తర్వాతనే అదీ చిత్రానికి లాభాలు వస్తేనే తీసుకుంటానని అన్నయ్యకు హామీ ఇచ్చాడట. అన్నదమ్ముల బంధం అంటే ఇలా ఉండాలి అంటున్నారు సినీజనాలు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ