Advertisementt

'బాహుబలి' ఆ రికార్డ్‌ బ్రద్దలైంది..!

Fri 15th Jul 2016 02:16 PM
bahubali,sultan,1st week collections record,salman khan,prabhas,india wise  'బాహుబలి' ఆ రికార్డ్‌ బ్రద్దలైంది..!
'బాహుబలి' ఆ రికార్డ్‌ బ్రద్దలైంది..!
Advertisement
Ads by CJ

తెలుగు సినిమా చరిత్రను ప్రపంచస్థాయికి తీసుకెళ్ళిన దర్శకధీరుడి రాజమౌళి 'బాహుబలి' రికార్డును..బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ 'సుల్తాన్‌' రూపంలో బ్రద్దలు చేశాడు. వాస్తవానికి మొదటిరోజు కలెక్షన్ల విషయంలో 'బాహుబలి' రికార్డుని కదిలించలేకపోయిన 'సుల్తాన్‌'..మొదటి వీక్‌ కలెక్షన్ల విషయంలో మాత్రం బ్రేక్‌ చేసి సరికొత్త రికార్డుని సృష్టించాడు. ఇండియా వైజ్‌గా మొదటివారం బాహుబలి 185 కోట్ల నెట్‌ కలెక్షన్లు సాధించగా..సుల్తాన్‌ 208.82 కోట్ల నెట్‌ కలెక్షన్స్‌తో బాహుబలిని బీట్‌ చేసి మొదటి స్థానం దక్కించుకున్నాడు. దీంతో బాహుబలి రెండో స్థానంకు చేరుకుంది. ఇంకో విశేషం ఏమిటంటే మూడో స్థానంలో మళ్ళీ సల్మాన్‌ ఖాన్‌ మూవీనే ఉండటం. సల్మాన్‌ నటించిన భజరంగీ భాయిజాన్‌ మూడో స్థానంలో ఉండగా..పీకే, ధూమ్‌ 3 చిత్రాలు 4,5 స్థానాల్లో ఉన్నాయి. రికార్డులనేవి బ్రద్దలయ్యేందుకే కాబట్టి..మళ్ళీ 'సుల్తాన్‌' రికార్డుని 'బాహుబలి2' రూపంలో తెలుగు సినిమా బీట్‌ చేయాలని, చేస్తుందని టాలీవుడ్‌ ప్రేక్షకులు కోరుకుంటున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ