Advertisementt

చిరు అల్లుడుకి లైన్ క్లియర్!

Fri 15th Jul 2016 02:49 PM
chiranjeevi,kalyan,chiranjeevi son in law inter into movies,mega family,srija husband  చిరు అల్లుడుకి లైన్ క్లియర్!
చిరు అల్లుడుకి లైన్ క్లియర్!
Advertisement
Ads by CJ

మెగా కాంపౌండ్ నుండి మరో హీరో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అవ్వడానికి రెడీ గా వున్నాడు. ఆయన ఎవరో కాదు మెగా స్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్. ఈయనకి ఈమధ్యే చిరంజీవి చిన్న కూతురి శ్రీజ తో వివాహం అయ్యింది. అయితే మెగా ఫ్యామిలీలోకి వచ్చాక అతనికి కూడా యాక్టర్ అవ్వాలనే కోరిక కలిగింది. మరి యాక్టింగ్ ఫ్యామిలీలోకి వచ్చాక దాని మీద మోజు పడడం పెద్ద విషయం కాదు. ఒక సెలెబ్రిటీ అంటే అతనికి వుండే రేంజే వేరు. అందుకే కళ్యాణ్ కూడా సినిమాల్లో నటిస్తే తాను సెలెబ్రిటీ అవ్వచ్చు కదా అనుకున్నాడేమో. అందుకే సినిమాల్లో నటించాలనే బలమైన కోరిక కలిగింది. అయితే ఈ విషయాన్ని కళ్యాణ్ తన మామగారైన చిరంజీవికి చెప్పాడంట. ఇక చిరంజీవి ముందు ఒప్పుకుని ఆతర్వాత నువ్వు నటుడువి కావాలంటే ముందు యాక్టింగ్ స్కూల్ లో చేరు అని సలహా ఇచ్చాడంట. అంతే కాకుండా కళ్యాణ్ ని ఫిజిక్ లోను, లుక్ లోను చిన్న చిన్న మార్పులు అని అవసరమని చిరంజీవి చూచించాడని సమాచారం. ఇక అతని ఎంట్రీకి చిరు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడని.... ఈ వచ్చే శ్రావణ మాసం లోనే అతని ఎంట్రీ ఉంటుందని సమాచారం. చిరంజీవి చెప్పినట్టే కళ్యాణ్ ఫాలో అవుతున్నాడని సమాచారం. ఇంకేముంది మెగా ఫ్యామిలీలోనుండి మరో హీరోని త్వరలోనే చూడబోతున్నామన్నమాట. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ