ఢిల్లీలో అధికారాన్ని కైవసం చేసుకుని ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్న ఆమ్ ఆద్మీపార్టీ కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా రాజకీయాలను బాగా ఒంటపట్టించుకొని మోదీకి ఇబ్బందులు సృష్టించే నిర్ణయాలు, స్టేట్‌మెంట్లు చేస్తున్నాడు. ప్రస్తుతం కేజ్రీవాల్ వచ్చే ఏడాది జరగబోయే గుజరాత్, పంజాబ్ ఎన్నికలపై దృష్టిసారించాడు. తన ట్వీట్లలో బిజెపిలో అయోమయం క్రియేట్ చేయడంలో విజయం సాధిస్తున్నాడు. గుజరాత్‌లో మంచి పట్టున్న పటేళ్లలో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర ప్రభావమే సృష్టిస్తోంది. త్వరలో బిజెపి ముఖ్యమంత్రిగా ఉన్న ఆనంది బెన్ పటేల్‌ను ముఖ్యమంత్రిగా తీసివేసి బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ముఖ్యమంత్రి పీఠం అధిరోహించనున్నాడంటూ బిజెపి కార్యకర్తల్లో గందరగోళం సృష్టిస్తున్నాడు. మరోవైపు వచ్చే ఏడాదిలో ఎన్నికలు జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని అధికారం లోకి తీసుకురావాలని, ఇతర రాష్ట్రాల్లో కూడా పార్టీని పటిష్టం చేయడం కోసం కేజ్రీవాల్ పార్టీపై బాగా దృష్టిసారించాడని, దాంతో ఢిల్లీ ముఖ్యమంత్రిగా తన భార్యను అందలం ఎక్కించాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల కేజ్రీవాల్ భార్య తన ఉద్యోగానికి స్వచ్చందంగా రాజీనామా చేయడంతో ఇది నిజమేనన్న వార్తలు వస్తున్నాయి. మొత్తానికి కేజ్రీవాల్ రాజకీయాల్లో చాలా స్పీడుగా ఎత్తుకుపైఎత్తులు ఒంటపట్టించుకుంటున్నాడు.