Advertisementt

హీరోగా ఇక అవకాశాలు రావని ఫిక్సయ్యాడా!

Mon 18th Jul 2016 07:28 PM
allari naresh,selfie raja,direction,allari naresh eye on direction,evv satyanarayana  హీరోగా ఇక అవకాశాలు రావని ఫిక్సయ్యాడా!
హీరోగా ఇక అవకాశాలు రావని ఫిక్సయ్యాడా!
Advertisement
Ads by CJ

కామెడీ కి పెట్టింది పేరైన అల్లరి ఈ మధ్యకాలంలో ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోతున్నాడు. అంతేకాకుండా ఈ మధ్య వచ్చిన సినిమాలన్నీ వరసగా ప్లాప్ అవుతూ వస్తున్నాయి. తాజాగా వచ్చిన సెల్ఫీ రాజా కూడా ఆశించిన విజయం అందించలేదు. ఇక అల్లరి నరేష్ ఆదివారం జరిగిన ఒక టీవీ షో లో పాల్గొని చాలా ఆసక్తికరమైన విషయాలు మాట్లాడాడు. తన తండ్రి ఈ.వీ.వీ సత్యనారాయణ.. అల్లరి నరేష్ ని ఒకసారి దగ్గరకి పిలిచి అసలు నువ్వు ఏం కావాలనుకుంటున్నావ్ అని అడిగారట..... అయితే వెంటనే నరేష్ నేను హీరో అవుదామని అనుకుంటున్న అని అన్నాడట. కాని ఈ.వీ.వీ. గారు దానికి.. నువ్వు హీరో కంటే డైరెక్టర్ అయితే బావుంటుందని అన్నారట. కానీ నరేష్ కి సినిమాల్లో వున్న మోజుతో హీరో అయ్యాడట. త్వరలో దర్శకత్వం చేసి తన తండ్రి కోరిక తీరుస్తానని అల్లరి అంటున్నాడు. అయితే తన డైరెక్షన్ ఏ హీరోతోనో, నిర్మాత ఎవరో అనే విషయాలు మాత్రం అల్లరి చెప్పలేదు... కానీ ఒక ప్యూర్ లవ్ స్టోరీని మాత్రం డైరెక్ట్ చేస్తానని తెలిపాడు. అయితే ఈ సినిమాకి కొంచెం టైం పడుతుందని అన్నాడు. అలాగే తన మ్యారీడ్ లైఫ్ కూడా బావుందని చెప్పాడు. 

అయితే గత కొంత కాలంగా సరైన హిట్ లేని నరేష్..ఇక హీరో గా తనకి అవకాశాలు రావనే..ఇలా డైరెక్టన్ వైపు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని..అలా చెప్పుకోవడం ఇష్టం లేక ఇలా తండ్రి కోరిక అని చెప్పుకుంటున్నాడని ఫిల్మ్ ఇండస్ట్రీ లోని కొందరు అనుకోవడం విశేషం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ