కెరీర్ మొదటి నుంచి తీసుకుంటే అల్లుఅర్జున్ ఎక్కువగా వెరైటీ చిత్రాలు చేస్తూ వచ్చాడు. కానీ రామ్‌చరణ్ మాత్రం ప్రయోగాలు బెడిసికొట్టడంతో మాస్ అండ్ యాక్షన్ చిత్రాలు చేస్తూ వచ్చాడు. దీంతో చరణ్ సినిమాలు ఒకే మూసలో ఉంటాయనే విమర్శలు కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు మాత్రం ఈ ఇద్దరు తమ పొజిషన్లు మార్చుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఇటీవలికాలంలో బన్నీ అతిథి పాత్రలో చేసిన 'రుద్రమదేవి' తప్ప ఆయన చేసిన 'రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు' వంటి చిత్రాలు ఆయనకు వెరైటీ అనిపించినా కమర్షియల్‌గా ఇవ్వన్నీ రిస్క్‌లేని ప్రాజెక్ట్‌లే. త్వరలో ఆయన చేయనున్న హరీష్‌శంకర్ చిత్రం కూడా ఆ కోవలోనే ఉంటుందని సమాచారం. కానీ ఇప్పుడు చరణ్ మాత్రం వైరీటీ చిత్రాల వైపు చూస్తున్నాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న తమిళ 'తని ఒరువన్' రీమేక్ 'ధ్రువ' ఓ డిఫరెంట్ జోనర్ ఫిల్మ్. తర్వాత చరణ్.. సుకుమార్‌తో చేయనున్న చిత్రం కూడా ఓ ప్రయోగాత్మకమైన సైన్స్‌ఫిక్షన్ మూవీ అని తెలుస్తోంంది. మొత్తానికి బన్నీ, చరణ్‌లు ఇప్పుడు తమ పొజిషన్లు మార్చుకుంటున్నట్లు కనిపిస్తోంది.